డిసెంబర్ మాసాంతంలోగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు మాస్టర్ ప్లాన్

Telangana Master Plan For All Municipalities Of The State Will Be Done By The End Of December,Master Plan For All Municipalities,Telangana State Municipalities,Municipalities Plan End Of December,Mango News,Mango News Telugu,Municipalities Of The State,New Master Plan,New Master Plan For Hyderabad,New Municipalitie Plan For Hyderabad,Ktr Directs All Municipalities,Urban Development,Telangana Revised Development Plan,Telangana Municipalities,New Municipal Rules In Telangana

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ మాసాంతంలోగా అన్ని మున్సిపాలిటీలకు మాస్టర్ ప్లాన్ అమలు అవుతుందని రాష్ట్ర మున్సిపల్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన పురపాలక సంఘాలతో కలిపి మొత్తం 142 పురపాలకసంఘాలు/కార్పోరేషన్ లు ఉన్నాయని, వీటిలో 74 పురపాలకసంఘాలకు మాస్టర్ ప్లానులు ఆమోదించబడి అమలులో ఉన్నాయని తెలిపారు. ఈ 142 నుండి 74 పురపాలక సంఘాలను మినహాయించగా మిగిలిన 68 పురపాలక సంఘాలలో మహబూబాబాద్, ఆందోల్ జోగిపేట్, కొలాపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట్, సత్తుపల్లి, భూపాలపల్లి, దేవరకొండ పట్టణముల 8 మాస్టర్ ప్లానులు తయారు చేయబడి ప్రభుత్వ ఆమోదానికి సమర్పించబడ్డాయన్నారు. 15 మాస్టర్ ప్లానులు తయారు చేయబడి ప్రభుత్వ ఆమోదమునకు పంపించుటకు సిద్ధంగా ఉన్నాయని, అదేవిధంగా 45 మాస్టర్ ప్లానులు యుద్ధప్రాతిపదికన తయారు చేయబడుచున్నవని తెలిపారు. ఈ మేరకు మున్సిపల్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

మాస్టర్ ప్లానులు అమలులో ఉండి కాలపరిమితి ముగిసిన 27 మాస్టర్ ప్లాన్లలో, 2 పట్టణముల రివైజ్డ్ మాస్టర్ ప్లాన్లు ప్రభుత్వముచే ఆమోదించబడ్డాయని, 2 రివైజ్డ్ మాస్టర్ ప్లాన్లు ప్రభుత్వ ఆమోదమునకై సమర్పించబడ్డాయని, మిగిలిన 23 పట్టణముల మాస్టర్ ప్లాన్లన్నీ కూడా రివిజన్ చేపట్టబడినవి పేర్కొన్నారు. ఇట్టి ముసాయిదా మాస్టర్ ప్లాన్లు అన్నీ కూడా ఎటువంటి జాప్యము లేకుండా డిసెంబర్ 2022 లోగా ప్రభుత్వ ఆమోదమునకు సమర్పించబడునని తెలిపారు. ఈ మాస్టర్ ప్లాన్లన్నీ కూడా “జియోగ్రాఫికల్ టెక్నాలజీ సిస్టం” ద్వారా అధునతన సాంకేతిక పరిజ్ఞానముతో ఎటువంటి సాంకేతిక లోపాలు లేని విధంగా, పద్ధతి ప్రకారంగా రూపొందించబడుతున్నాయన్నారు. తమ భూవినియోగ వివరములను సులభముగా తెలుసుకుని, అనుమతులు పొందడంలో ఈ విధానం వలన ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని చెప్పారు.

మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో భాగంగా ముందుగా నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నుండి శాటిలైట్ ఇమేజెస్ సేకరించి, రెవెన్యూ శాఖ నుండి సర్వేనెంబర్ల వివరములున్న మ్యాపులు తీసుకుని, నిష్ణాతులైన అర్బన్ ప్లానర్స్ ద్వారా పట్టణమును క్షుణ్ణంగా సర్వే చేయించి ప్రస్తుతమున్న రోడ్ల వివరములతో పాటు రెసిడెన్షియల్, కమర్షియల్ మొదలైన భూవినియోగ వివరములను కూడా పొందుపరచడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఇట్టి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో పట్టణమునకు సంబంధించిన అభివృద్ధిపరమైన వివరములను 21 వివిధ ప్రభుత్వ శాఖలనుండి సేకరించబడతాయని, సమగ్రమైన సమాచారసేకరణ పిదప దశలవారీగా స్టేక్ హోల్డర్స్ సమావేశాలు నిర్వహించి, తదనుగుణంగా వచ్చే సలహాలు, సూచనలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వ ఆమోదమునకు పంపించబడుతుందని చెప్పారు. ప్రస్తుతం రూపొందించబడుతున్న మాస్టర్ ప్లాన్లలో 54 మాస్టర్ ప్లాన్లను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ అండ్ గ్రామీణ, పట్టణ ప్రణాళికా శాఖ డైరెక్టరేట్ ల ద్వారా సంయుక్తముగా రూపొందించబడుచున్నవని, అదేవిధంగా 10 మాస్టర్ ప్లాన్లు అమృత్ పథకం కింద, 20 మాస్టర్ ప్లాన్లు తెలంగాణ మునిసిపల్ డెవలప్మెంట్ ప్లాన్ కింద రూపొందించబడుచున్నవని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 19 =