సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో 50 పడకల కోవిడ్ వార్డు ప్రారంభం, ‌రూ.2.28 కోట్ల నిధులు

KTR, Minister KTR, Sircilla Coronavirus, Sircilla Coronavirus News, Sircilla Coronavirus Updates, Sircilla Government Hospital, Special COVID Ward in Sircilla Government Hospital, telangana

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటిఆర్‌ ఆగస్టు 3, సోమవారం నాడు సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, సిరిసిల్లలోని జిల్లా ఏరియా ఆస్పత్రిలో 50 పడకల స్పెషల్ కోవిడ్‌ వార్డును ప్రారంభించారు. అలాగే 5 కొత్త అంబులెన్స్‌లను కూడా మంత్రి కేటిఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టినట్టు తెలిపారు.

జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో 50 పడకల ప్రత్యేక వార్డును ప్రారంభించామని, అందులో 10 ఐసీయూ పడకలు ఏర్పాటు చేశామన్నారు. సీఎస్‌ఆర్‌ పథకం కింద రూ.2.28 కోట్ల నిధులను జిల్లా ఆస్పత్రికి రేపు సాయంత్రంలోగా అందజేస్తామని, ఇందులో తన వంతుగా 20 లక్షల రూపాయలను ఆసుపత్రికి ఇవ్వనున్నట్టు చెప్పారు. జిల్లాలో రోజుకి 1000 టెస్టులు చేసే ఆలోచన చేస్తున్నామని, అలాగే సర్దాపూర్ లోని అగ్రికల్చర్ పాలీ టెక్నిక్ కాలేజీలో మొదట విడతగా 32 పడకల ఐసొలేషన్ వార్డును కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu