తెలంగాణలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Patancheru MLA Mahipal Reddy, Patancheru MLA Mahipal Reddy Tests Positive for Coronavirus, Ramagundam MLA Korukanti Chander, Ramagundam MLA Korukanti Chander Tests Positive for Coronavirus, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus News

తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ప‌టాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్ రెడ్డికి కూడా క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. ఆయన పీఏ, గ‌న్‌మెన్‌ల‌కు కూడా క‌రోనా సోకింది. ఎమ్మెల్యే మ‌హిపాల్ రెడ్డి ప్ర‌స్తుతం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది.

మరోవైపు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు కరోనా పాజిటివ్‌ గా తేలింది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతునట్టు సమాచారం. ఎమ్మెల్యేకు కరోనా సోకడంతో ఆయన వద్ద పనిచేసే సిబ్బంది, గత కొన్నిరోజులుగా కలిసిన వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడగా, చికిత్స అనంతరం వారంతా పూర్తిస్థాయిలో కోలుకున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here