హైద‌రాబాద్ నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నాం – అసెంబ్లీలో మంత్రి కేటీఆర్

Minister KTR Statement on Hyderabad Development in Telangana Assembly Today, KTR Statement on Hyderabad Development in Telangana Assembly Today, Hyderabad Development in Telangana Assembly Today, Minister KTR Statement on Hyderabad Development, Hyderabad Development, Telangana Budget Session 2022, Telangana Budget Session, TS Budget Session, 2022 Telangana Budget Session, Telangana Assembly Budget Session 2022-23, Telangana Assembly Budget Session 2022, Telangana Assembly Budget Session, Telangana Assembly Budget, Telangana assembly budget session, Telangana Budget 2022-23, Telangana Budget 2022, Telangana Budget, Telangana, Telangana Assembly, Telangana Assembly, Telangana Assembly Session, Manog News, Manog News Telugu,

హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధికి బ‌హుముఖైన ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నాం అని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ ఈరోజు (గురువారం) అసెంబ్లీలో ప్రకటించారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా.. ఎస్ఆర్‌డీపీ (ఎస్ఆర్‌డీపీ) ప‌థ‌కం కింద చేప‌ట్టిన ప‌నుల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కింద రూ. 37 వేల కోట్ల‌తో 70 ప‌నుల‌ను ప్ర‌భుత్వం సిద్ధం చేసింద‌ని మంత్రి తెలిపారు. ఇప్పటికే రూ. 8 వేల 52 కోట్ల 82 ల‌క్ష‌ల కోట్లతో 47 ప‌నులు జరుగుతున్నాయని చెప్పారు.

జీహెచ్ఎంసీ ద్వారా మరో 17, ఆర్ అండ్ బీ, నేష‌న‌ల్ హైవే శాఖ‌ల ద్వారా 3 ప‌నులు పురోగ‌తిలో ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. అలాగే, హైద‌రాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అనేక కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో ట్రాఫిక్ ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని ఫ్లై ఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌లు నిర్మిస్తున్నామ‌ని తెలిపారు. ఇప్పటికే, ఓవైసీ ఫ్లై ఓవ‌ర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌న్నారు కేటీఆర్. త్వ‌ర‌లోనే బ‌హ‌దూర్ పురా ఫ్లై ఓవ‌ర్‌ను కూడా ప్రారంభిస్తామ‌న్నారు. ఇంకా.. ఎస్ఆర్డీపీ కింద‌ రెండో ద‌శ‌లో ఉప్ప‌ల్‌లో రూ. 450 కోట్ల‌తో ఫ్లై ఓవ‌ర్, ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో రెండు ఫ్లై ఓవ‌ర్లు ఏర్పాటు చేయ‌బోతున్నట్లు తెలిపారు.

కార్వాన్ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ల్టీ లెవ‌ల్ ఫ్లై ఓవ‌ర్.. కుత్బుల్లాపూర్‌లో ఫాక్ సాగ‌ర్ నిర్మాణ దశలో ఉన్నాయన్నారు మంత్రి కేటీఆర్. సికింద్రాబాద్ ప‌రిధిలోని చిలుకల‌గూడ‌, మాణికేశ్వ‌రి న‌గ‌ర్‌లో ఆర్‌యూబీలు నిర్మిస్తామ‌న్నారు. చార్మినార్ పరిధిలో బండ్ల‌గూడ వ‌ద్ద ఫ్లై ఓవ‌ర్.. హుమ‌ర్ హోట‌ల్ వ‌ద్ద మ‌రో ఫ్లై ఓవ‌ర్ నిర్మించటానికి ప్రణాళికలు వేస్తున్నామన్నారు. మూసీ న‌ది అభివృద్ధి, సుంద‌రీక‌ర‌ణ కోసం కూడా అనేక చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. నాగోల్, చాద‌ర్ ఘాట్, ముస్లింజంగ్ బ్రిడ్జి వ‌ద్ద మూసీపై  బాటసారుల కోసం వాక్ వే ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ