తెలంగాణా కుంభమేళాకు పూర్తవుతున్న ఏర్పాట్లు

It Is Time For Medaram Mahajatara, Time For Medaram Mahajatara, Medaram Mahajatara, Medaram Jatara Arrangements, Telangana Kumbh Mela, Medaram Jatara, Latest Medaram Mahajatara News, Medaram Mahajatara News Update, Latest Kumbam Mela News, Kumbam Mela News Update, Sammakka, sarakka, Sammakka sarakka Jatara, Telangana, Mango News, Mango News Telugu
Medaram Mahajatara, Medaram jatara arrangements,Telangana Kumbh Mela,Medaram jatara

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్కసారలమ్మ జాతర..  ఈ ఏడాది ఫిబ్రవరిలో 21నుంచి 24వ తేదీ వరకు జరగబోతోంది. దీంతో ఇప్పటికే మేడారంలో అభివృద్ధి పనులపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది.మేడారం అభివృద్ధి పనులను జనవరి నెలాఖరులోగా  పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది.  తెలంగాణ  దేవాదాయ, అటవీశాఖ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ.. తాజాగా మేడారం వెళ్లి మేడారం జాతర పనులను పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక 2014లో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా మేడారం జాతర కీర్తి గడించింది. ఇక్కడి వన దేవతలను దర్శించుకోవడానికి తెలంగాణ నుంచే కాదే.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా  భక్తులు తరలివస్తుంటారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ  మేడారం గ్రామం ఉంది.  ములుగు కేంద్రం నుంచి 44 కి.మీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం ఉంది. దట్టమైన అడవులు, కొండల మధ్యనే సమ్మక్క సారలమ్మలు కొలువై ఉంటారు. నాలుగు రోజుల జాతరలో భాగంగా గద్దెనెక్కిన దేవతలు.. చివరికి వన ప్రవేశం చేయడంతో ఈ మహా జాతర ముగుస్తుంది.

మేడారం మహా జాతరపై  సమీక్ష నిర్వహించిన కొండా సురేఖ త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. జాతరని ప్లాస్టిక్ రహిత జాతరగా, పర్యావరణహితంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ జాతరలో భక్తుల కోసం కాటన్ సంచులను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.  ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు పరుస్తూ..ఈ జాతరలో ఎలాంటి ఫ్లెక్సీలు లేకుండా, కేవలం పెయింటింగ్, క్లాత్ బ్యానర్లు ప్రోత్సహిస్తున్నట్లు కొండా సురేఖ  తెలిపారు.

అలాగే ఈ సమావేశంలో మాట్లాడిన  మంత్రి సీతక్క.. జాతరకు పక్కా ప్రణాళికతో విస్తృత ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అన్ని సివిల్ పనులు జనవరి 30 తేదీలోపు  పూర్తి చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరం అయిన చోట్ల రోడ్డు నిర్మాణాలతో పాటు మరమ్మతులు, విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలని అన్నారు. మేడారం జాతరకు  తెలంగాణ ప్రభుత్వం పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 9 =