వరంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం, 20 మందికి తీవ్ర గాయాలు

Road Accident at Warangal, 20 People severely injured

వరంగల్ రూరల్ జిల్లాలో శుక్రవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమకొండ నుంచి భూపాలపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును శాయంపేట మండలంలోని మందారిపేట శివారులో ఇసుక లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్నవారిలో 20 మందికి తీవ్ర గాయాలవగా, మరో 10 మంది స్పల్పంగా గాయపడ్డట్టు తెలుస్తుంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితులను పరిశీలించారు. మరోవైపు లారీ అతివేగంగా రావడం వలనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ