తెలంగాణలో ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలు రద్దు, విద్యార్థులంతా పాస్

Mango News, telangana, TELANGANA OPEN SCHOOL SOCIETY, Telangana Open School Society SSC Inter Students Passed, Telangana Open School Society Studends, Telangana Open School Society Students Passed, TOSS SSC & Inter Result 2021, TOSS SSC Intermediate candidates declared pass, TOSS SSC Intermediate Exams Cancelled, TOSS SSC Intermediate Exams Cancelled Students Declared Pass with 35 Percent Marks, TS Open School

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్స్ కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ పరీక్షలను కూడా రద్దు చేస్తూ, విద్యార్థులందరినీ పాస్‌ చేస్తునట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జూలై 29, మంగళవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) పరిధిలో పదవతరగతి మరియు ఇంటర్మీడియట్ కోర్సులలో రిజిష్టర్ చేసుకొని, జూలై 2021 పబ్లిక్ పరీక్షలుకు హాజరు కావడానికి అర్హత కలిగిన విద్యార్థులను ప్రతీ సబ్జెక్టులో 35 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనట్టుగా ప్రకటించారు.

విద్యార్ధులు ఎవరైతే 35 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనారో, వారు వారి యొక్క మార్కులను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంప్రూవ్ మెంట్ నియమ నిబందనలుకు లోబడి తదుపరి నిర్వహించబోయే పరీక్షలకు అనుమతించబడతారని తెలిపారు. ఓపెన్ స్కూల్ ద్వారా చదువుతున్న 63581 మంది పదో తరగతి విద్యార్థులకు, 47392 వేల మంది ఇంటర్‌ విద్యార్థులకు ప్రభుత్వ నిర్ణయం వలన ప్రయోజనం కలిగింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − five =