తెలంగాణ నూతన సచివాలయం డిజైన్ ఇదే… విడుదల చేసిన సీఎం కార్యాలయం

New Secretariat Design, telangana, Telangana CMO Office has Released New Secretariat Design, Telangana New Secretariat, Telangana New Secretariat Construction, Telangana New Secretariat Design

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నూతన సచివాలయం డిజైన్ చిత్రాన్ని సీఎం కార్యాలయం విడుదల చేసింది. గతంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నూతన సచివాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. పాత సచివాలయ భవనాల్ని కూల్చివేసి, కొత్త భవనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.

మరోవైపు ఇటీవల హైకోర్టు తీర్పుతో నూతన సచివాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయిన నేపథ్యంలో పాత సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ జూలై 7, మంగళవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. సచివాలయం వైపుగా రాకపోకలు నిలిపివేసి, అటు వెళ్లే మార్గాలను పోలీసులు మూసివేశారు. కూల్చివేత పనులు జరుగుతుండడంతో పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సచివాలయంలోని సీ బ్లాక్‌ను కూల్చివేత పక్రియ కొనసాగుతున్నటుగా తెలుస్తుంది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu