గాంధీ ఆసుపత్రిని పరిశీలించిన తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్

Telangana CS Somesh Kumar Visited Gandhi Hospital Today,Mango News,Mango News Telugu,Telangana CS Somesh Kumar,CS Somesh Kumar,Somesh Kumar,Telangana CS Somesh Kumar Latest News,CS Somesh Kumar News,CS Somesh Kumar Live,CS Somesh Kumar Live Updates,CS Somesh Kumar Pressmeet,CS Somesh Kumar Speech,CS Somesh Kumar Visited Gandhi Hospital Today,Gandhi Hospital,Telangana Gandhi Hospital,Telangana,Telangana News,Telangana CS Somesh Kumar inspects Gandhi Hospital,Hyderabad,Chief Secretary Somesh Kumar Visits Gandhi Hospital,Telangana CS Visits Gandhi Hospital,New COVID ward At Gandhi hospital,Covid-19,Coronavirus,Covid-19 In Telangana,Telangana CS Visited Gandhi Hospital

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం నాడు గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. లైబ్రరీ భవనంలో కోవిడ్ రోగుల కోసం 160 అదనపు పడకలతో సిద్ధం చేసిన కొత్త వార్డును సీఎస్ పరిశీలించారు. ఇది త్వరలో ప్రారంభించబడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రినందు అందిస్తున్న చికిత్స సదుపాయాలను సీఎస్ పరిశీలించారు. తదుపరి ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో మాట్లాడి, ఉత్తమ సేవలు అందిస్తున్నారని వైద్యులను ఆయన అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు.

రోజుకు 4 మెట్రిక్ టన్నుల సామర్ద్యంతో నెలకొల్పి, నేటి నుండి పనిచేస్తున్న కొత్త ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ను కూడా సీఎస్ సోమేశ్ కుమార్ తనిఖీ చేసారు. ఈ కొత్త ఆక్సిజన్ ప్లాంట్ 400 మంది పేషంట్లకు సరిపడా ఆక్సిజన్ ను అందిస్తుంది. రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించుటకై శుభ్రత డ్రైవ్ కింద చేపట్టిన పారిశుధ్యం, వీధి దీపాలు, ఆక్సిజన్ పైప్ లైన్ పనులను సీఎస్ పరిశీలించారు. ఈ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు. గాంధీ ఆసుపత్రి సందర్శనలో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేశ్ కుమార్, మున్సిపల్ పరిపాలన కమీషనర్ మరియు డైరెక్టర్ యన్.సత్యనారాయణ, పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, టిఎస్ఐఐసి ఎండీ నర్సింహారెడ్డి, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ