కుటుంబానికి రూ.4 వేల కోవిడ్ ఆర్ధిక సాయం, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం

Tamil Nadu CM MK Stalin Announced Rs 4000 for BPL Families under Covid Pandemic Relief,Mango News,Mango News Telugu,Tamil Nadu Chief Minister,Tamil Nadu,Tamil Nadu News,Tamil Nadu CM,MK Stalin Swearing In Ceremony Live Updates,DMK President MK Stalin Takes Oath,MK Stalin,DMK Chief MK Stalin,MK Stalin Latest News,MK Stalin Swearing-in Ceremony,MK Stalin DMK,DMK MK Stalin,MK Stalin News Today,DMK Stalin,MK Stalin Swearing-in,Stalin Swearing Ceremony,Stalin,DMK,Stalin Oath Ceremony,CM MK Stalin Announced Rs 4000 for BPL Families,Covid Pandemic Relief,MK Stalin's First Govt Order,Rs 4000 as COVID pandemic relief,Rs 4000 To BPL Families Affected By Covid-19 In Tamil Nadu,Stalin Announces Rs 4000 As Covid Relief

తమిళనాడు రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే స్టాలిన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రులలో చేరిన బాధితులకు అయ్యే ఖర్చును తమ ప్రభుత్వం భరిస్తుందని సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం పరిధి కింద ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని చెప్పారు.

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా పేదలకు ఆర్ధిక సాయం ప్రకటించారు. రాష్ట్రంలో రేషన్‌ కార్డు కలిగిన 2.07 కోట్ల కుటుంబాలకు రూ.4 వేల చొప్పున సాయం అందిస్తామని చెప్పారు. మే నెలలో మొదటి విడత కింద రూ.2 వేలు జమ చేస్తామని తెలిపారు. అలాగే ప్రభుత్వ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు రాష్ట్రంలో పాలధరను కూడా లీటర్‌ కు రూ.3 తగ్గిస్తునట్టుగా సీఎం ఎంకే స్టాలిన్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 6 =