తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల వలన రాష్ట్రంలో ఏడాదికి రెండు పంటలు పండుతున్నాయని పేర్కొన్నారు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. శుక్రవారం ఆయన సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో పర్యటించారు. పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని పలు కమిటీల చైర్మన్ల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. దుబ్బాక నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్‌గా భాస్కర్ చారి, తొగుట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమురయ్య, దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఇప్ప లక్ష్మి తదితరులు మంత్రి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కమిటీ ఛైర్మన్లుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. ఒకప్పుడు తెలంగాణ అంటే కరువు ప్రాంతంగా భావించేవారని, అయితే రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ద పెట్టారని తెలిపారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం, మిషన్ భగీరథ సహా అనేక చిన్నా, పెద్దా ప్రాజెక్టులు కట్టించారని, దీంతో ఇప్పుడు రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని చెప్పారు. ప్రస్తుతం వర్షాకాలంతో పని లేకుండా తెలంగాణ రైతులు ఏడాదికి రెండు పంటలు పండిస్తున్నారని, ఇదంతా కేవలం సీఎం కేసీఆర్ దయతోనే సాధ్యపడిందని మంత్రి పేర్కొన్నారు.
ఈరోజు దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందంటే దానికి కారణం సీఎం కేసీఆర్ అని, రాష్ట్రంతో పాటు దేశం కూడా అభివృద్ధి చెందాలనేదే ఆయన లక్ష్యం అని మంత్రి హరీష్ రావు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలలో తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఆయనను ఓడించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ‘జై జవాన్-జై కిసాన్’ నినాదాన్ని బీజేపీ నిర్వీర్యం చేసిందని, దేశానికి వెన్నుముకగా నిలిచిన ఈ రెండు వర్గాలను దారుణంగా వంచించిందని మంత్రి విమర్శించారు. బోర్లకు మీటర్లు పెట్టి ఒకవైపు రైతులను, అగ్నిపథ్‌తో సైనికులుగా మారాలన్న దేశ యువతను మరోవైపు మోసం చేశారని ఆయన విమర్శించారు. విద్యుత్ మీటర్ల నిబంధనే లేకుంటే రెండేళ్లలో రాష్ట్రానికి రావాల్సిన రూ. 12 వేల కోట్లుని ఎందుకు నిలిపేశారో సమాధానం చెప్పాలని మంత్రి హరీష్ రావు కేంద్రాన్ని నిలదీశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY