సమతామూర్తి సన్నిధిలో నేడు.. తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ, డీఆర్డీవో చీఫ్ సతీష్ రెడ్డి

TN Governor Ravindra Narayana And DRDO Chief Satish Reddy Participates In Sri Ramanujacharya Millennium Celebrations, TN Governor Ravindra Narayana, DRDO Chief Satish Reddy, DRDO Chief Satish Reddy Participates In Sri Ramanujacharya Millennium Celebrations, TN Governor Ravindra Narayana Participates In Sri Ramanujacharya Millennium Celebrations, Sri Ramanujacharya Millennium Celebrations, Ramanujacharya Millennium Celebrations, Ravindra Narayan, Governor of Tamil Nadu, Defence Research and Development Organisation, Defence Research and Development Organisation Chief Satish Reddy, Ramanujacharya Millennium Celebrations Latest News, Ramanujacharya Millennium Celebrations Latest Updates, Ramanujacharya Millennium Celebrations Live Updates, Mango News, Mango News Telugu,

శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని శ్రీరామనగరం ఆశ్రమంలో కన్నుల పండుగగా జరుగుతున్నాయి. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీనుంచి కొనసాగుతున్న ఈ మహా క్రతువులో 5 వేల మంది రుత్వికులు పాలుపంచుకుంటున్నారు. 1035 హోమకుండాలు నిరంతరం దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఆశ్రమం మొత్తం వేద మంత్రోచ్చారణతో ప్రతిధ్వనిస్తోంది. స్థానికంగానే కాక సుదూర ప్రాంతాలనుంచి కూడా ఎందరో భక్తులు ఈ వేడుకలను చూడటానికి వస్తుండటం విశేషం. ‘జై శ్రీమన్నారాయణ’ నామం భక్తుల నోట మార్మోగుతోంది.

ఈక్రమంలో 10వ రోజున కార్యక్రమంలో పాల్గొనటానికి తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ, డీఆర్డీవో చీఫ్ సతీష్ రెడ్డి, బాబా రాందేవ్ వంటి ప్రముఖులు విచ్చేశారు. నిర్వాహకులు ఆశ్రమంలోని విశేషాలను వారికి తెలియజేశారు. ఆ తర్వాత వారు 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు. అనంతరం లబ్దప్రతిష్ఠులైన కళాకారులచే నిర్వహింపబడుతున్న పలు సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఈ సందర్భంగా వారు ప్రసంగించారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమానికి తమను ఆహ్వానించినందుకు చినజీయర్ స్వామికి కృతఙ్ఞతలు తెలిపారు. వచ్చిన ప్రముఖ అతిథులకు చినజీయర్ స్వామి ఆశీర్వచనాలు అందించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here