తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టంపై ఇప్పటికే పూర్తిస్థాయి కసరత్తు నిర్వహించి, ఆమోదం దిశగా అడుగులేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వీఆర్వోల వద్ద నుంచి రెవెన్యూ రికార్డులు వెంటనే స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటలలోగా రెవెన్యూ రికార్డులను కలెక్టరేట్‌లో అప్పగించాలని వీఆర్వోలకు సూచించారు. రెవెన్యూ రికార్డుల సేకరణ ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటల్లోగా పూర్తిచేసి, సాయంత్రంలోగా ఈ అంశంపై కలెక్టర్లు సమగ్ర నివేదికను అందించాలని పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం జరిగే తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో అమలు చేయబోయే కొత్త రెవెన్యూ చట్టంపైనా కీలకంగా చర్చించి ఆమోదించే అవకాశమునట్టు తెలుస్తుంది. అనంతరం రెవెన్యూ చట్టానికి సంబంధించిన ముసాయిదా బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu