ఎల్బీస్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు, హాజరైన సీఎం కేసీఆర్

Telangana Govt to Host Iftar Party to Muslims Today at LB Stadium,

రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమయిన ఈ ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, హోమ్ మంత్రి మహమూద్ అలీ సహా పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, ప్రభుత్వాధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ ఇఫ్తార్ విందు ఏర్పాట్లను మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోంమంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ ముందుగానే పరిశీలించి, వివిధ శాఖల అధికారులకు కీలక సూచనలు చేశారు.

మరోవైపు ఇఫ్తార్ విందు ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. శుక్రవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ సమయంలో ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్‌ స్టాట్యూ, అక్కడి నుండి బషీర్‌బాగ్ వరకు ఇరువైపుల వెళ్లకుండా, ప్రత్యామ్నాయ రూట్లలో ప్రయాణించాలని ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ