కరీంనగర్ లో దళిత బంధు పథకంపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం

CM KCR, CM KCR held Review Meeting over Dalit Bandhu Scheme at Karimnagar, CM KCR held Review Meeting over Dalit Bandhu Scheme at Karimnagar Collectorate, CM KCR to brainstorm on Dalit Bandhu in Karimnagar, Dalit Bandhu scheme, Dalit Bandhu Scheme at Karimnagar Collectorate, Dalit Bandhu Scheme In Telangana, Dalit Bandhu Scheme News, Dalit Bandhu Scheme Pilot Project, Dalit Bandhu Scheme Updates, Karimnagar, Karimnagar Collectorate, KCR Review Meeting over Dalit Bandhu Scheme, KCR to review Dalit Bandhu, Mango News

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న దళిత బంధు పథకంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు హరీశ్​రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, పలువురు డిప్యూటీ కలెక్టర్లు, అధికారులు హజరయ్యారు. దళిత బంధు పథకం అమలుపై ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అధికారులకు కీలక సూచనలు చేశారు. ముందుగా దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆగస్టు 16న సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. హుజురాబాద్ లో దళిత బంధు అమలుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.2000 కోట్లను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్‌ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఫైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ లో దళిత బంధును విజయవంతం చేయడంపై నాయకులకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ పర్యటనలో భాగంగా ముందుగా సీఎం కేసీఆర్ గురువారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ లో వరంగల్‌ చేరుకున్నారు. అనంతరం హ‌న్మ‌కొండలోని ఎస్వీఎస్ క‌న్వెన్ష‌న్ లో జరిగిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ కుమారుడి వివాహానికి సీఎం హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. అక్కడినుంచి గురువారం రాత్రి కరీంనగర్‌ తీగలగుట్టపల్లిలోని కేసీఆర్‌భవన్‌ కు చేరుకొని అక్కడే బస చేశారు. ఇక శుక్రవారం ఉదయం అలుగునూర్‌ లో జరిగిన టీఆర్‌ఎస్‌ కార్మిక నేత రూప్‌సింగ్‌ కుమార్తె వివాహానికి సీఎం కేసీఆర్ హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. ఆతర్వాత కరీంనగర్‌ కు చేరుకుని మంత్రులు, అధికారులతో దళితబంధుపై సమీక్షా సమా‌వేశం నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + six =