తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో.. అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు దిశానిర్దేశం చేశారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఫీవర్ సర్వేతో జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి మెడికల్ కిట్లను పంపిణీ చేస్తామని హరీశ్ రావు చెప్పారు. పకడ్బందీగా సర్వే చేపట్టి కరోనా మహమ్మారిని కట్టడి చేద్దామని అధికార యంత్రాంగానికి పిలుపునిచ్చారు.
ఫీవర్ సర్వేలో కోవిడ్ లక్షణాలను గుర్తిస్తే అక్కడికక్కడే హోం ఐసోలేషన్ కిట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కరోనా సెకెండ్ వేవ్ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ఫీవర్ సర్వే విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఆ సమయంలో తమ పనితీరును నీతి ఆయోగ్ ప్రశంసించిందని హరీశ్ రావు గుర్తు చేశారు. థర్డ్ వేవ్ లో కరోనా సోకినా కొంతమందిలో వ్యాధి లక్షణాలు కనిపించడం లేదు. ఒకవేళ లక్షణాలున్నా కొంతమంది పరీక్షలకు ముందుకు రావడం లేదు. అందుకే ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సర్వే చేపట్టనుంది. ముందు జాగ్రత్తగా రేపటి నుంచి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నాం. వ్యాధి లక్షణాలు ఉంటే హోం ఐసోలేషన్ కిట్ ఇచ్చి మందులు వాడుకునే విధానాన్ని తెలియజేస్తాం.
సీఎం కేసీఆర్ నెలరోజుల క్రితమే టెస్టింగ్ హోం ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆయన సూచనల మేరకు 2 కోట్ల టెస్టింగ్ కిట్లు, 1 కోటి హోం ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేశాం. ఆయా కిట్లను అన్ని జిల్లాల్లోని ఏరియా ఆస్పత్రులకు పంపించాం. జిల్లా ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాం. రాష్ట్రంలోని 27వేల పడకలను ఆక్సిజన్ బెడ్స్ గా మార్చాం. అలాగే, 76 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మించి ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచుకోగలిగాం. లక్షణాలుంటే వెంటనే దగ్గర్లోని బస్తీ దవాఖానా, ప్రభుత్వ ఆస్పత్రుల వద్దకు వెళ్తే హోం సోలేషన్ కిట్స్ అందిస్తారు అని హరీశ్ రావు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వ సూచనలను ప్రజలు పాటించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF