కోటీ 48 లక్షల 23 వేల ఎకరాలకు రైతుబంధు నిధులు : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Mango News, Mango News Telugu, Rs 7411.52 CR Funds Transfers to Accounts of 62.99 Lakh Farmers in the State, Rythu Bandhu, Rythu Bandhu disbursal, Rythu Bandhu Distribution, Rythu Bandhu For Farmers, Rythu Bandhu for Rabi Season, Rythu Bandhu Funds, Rythu Bandhu Funds Allocation, Rythu Bandhu Funds Distribution, Rythu Bandhu Funds Transfers, Rythu Bandhu Scheme, Telangana Rythu Bandhu, Telangana Rythu Bandhu Distribution, Telangana Rythu Bandhu Funds Distribution, TS Rythu Bandhu for Rabi

రాష్ట్రంలో 62.99 లక్షల మంది రైతులకు మొత్తం రూ.7411.52 కోట్ల రైతుబంధు నిధులను జమ చేసినట్టు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోటీ 48 లక్షల 23 వేల ఎకరాలకు రైతుబంధు నిధులు అందించడం జరిగిందన్నారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 4,69,696 మంది రైతులకు రూ.601,74,12,080 కోట్ల నిధులు, సంగారెడ్డి జిల్లాలో 3,18,988 మంది రైతులకు రూ.370,74,52,397 కోట్లు, నాగర్ కర్నూలు జిల్లాలో 2,77,920 మంది రైతులకు రూ.367,35,27,173 కోట్లు, ఖమ్మం జిల్లాలో 3,08,479 మంది రైతులకు రూ.356,12,83,145 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో 2,94,972 మంది రైతులకు రూ.345,33,35,080 కోట్లు, సిద్దిపేట జిల్లాలో 2,94,362 మంది రైతులకు రూ.310,65,93,586 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 2,61,079 మంది రైతులకు రూ.309,28,13,804 కోట్లు, వనపర్తి జిల్లాలో 1,58,994 మంది రైతులకు రూ.180,40,64,102 కోట్ల నిధులు జమచేశామని చెప్పారు. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 33,452 మంది రైతులకు రూ.33.65 కోట్లు అందించామన్నారు.

“రైతుబంధుతో సీఎం కేసీఆర్ వ్యవసాయరంగానికి ఒక దిక్సూచిలా నిలిచారు. రైతుభీమాతో రైతుల ఆత్మబంధువు అయ్యారు. వ్యవసాయరంగం పట్ల కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ విధానం అవలంభించాలి. ఉపాధిహామీని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలి. వ్యవసాయరంగంలో కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలకు మద్దతుధరలను ఆయా రాష్ట్రాలను, ప్రాంతాలను బట్టి నిర్ణయించాలి. పండించిన పంటలన్నీ కేంద్రం మద్దతుధరలకు కొనుగోలు చేయాలి. స్వామినాధన్ కమిటీ సిఫారసులను యధావిధిగా అమలు చేయాలి. పంటలకు మద్దతు ధరలు ప్రకటించి కేంద్రం చేతులు దులుపుకోవడం శోచనీయం. 60 శాతం మంది జనాభా ఆధారపడిన వ్యవసాయరంగం పట్ల కేంద్రప్రభుత్వ విధానం మారాలి. రైతులు సంతోషంగా ఉంటేనే సమాజం సంతోషంగా ఉంటుంది. దశాబ్దాలుగా పాలకులంతా రైతులను ఓటు బ్యాంకులుగానే చూశారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలు, నిర్ణయాలతో రైతుల పట్ల, వ్యవసాయరంగం పట్ల ఆయా రాష్ట్రాల దృక్పధం మారుతూ వస్తున్నది. అన్నం పెట్టే అన్నదాతల కష్టాలను గుర్తించి చేయూతనందించింది సీఎం కేసీఆర్ మాత్రమే” అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =