ప్రతి జిల్లాకు ఒక ఎయిర్‌పోర్టు.. సీఎం జగన్ కొత్త విధానం

Andhra CM YS Reddy roots for One district One airport, Andhra Pradesh CM, AP CM directs to expedite new airport works, AP CM new airport works, AP CM YS Jagan Held Review on Ports and Airports Construction, AP CM YS Jagan Held Review on Ports and Airports Construction In the State, AP new airport works, Mango News, One district One airport, YS Jagan Held Review on Ports and Airports Construction, YS Jagan reviews Ports and Airports

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్‌ డిస్ట్రిక్ట్-వన్‌ ఎయిర్‌పోర్టు ఉండాలన్నదే తమ కాన్సెప్ట్ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ విధానానికి అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని అధికారులను ఆదేశించారు. పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాణపనులపై అధికారులు సీఎంకు వివరాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో ఏకరీతిగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని, ఇందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎయిర్‌పోర్టులలో బోయింగ్‌ విమానాలు సైతం ల్యాండింగ్‌ అయ్యేలా రన్‌వే అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 6 విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు, మరో రెండు కొత్త విమానాశ్రాయల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు వివరించారు. విజయనగరం జిల్లా భోగాపురం మరియు నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల పనులు త్వరితగతిన పూర్తి కావాలని, ఇందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలన్నారు. నిర్ణీత కాల వ్యవధిలోగా పెండింగ్‌ సమస్యలు పరిష్కారం కావాలని, గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం అధికారులకు ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 2 =