అజ్మీర్ దర్గాను సందర్శించే తెలంగాణ వాసులకు వసతి సదుపాయం – హోం మంత్రి మహమూద్ అలీ.

Telangana Mahmood Ali Says Accommodation Arranging for Telangana Residents Visiting Ajmer Dargah,Telangana Mahmood Ali,Mahmood Ali,Mahmood Ali Visits Ajmer Dargah,Accommodation Arranging for Telangana Residents,Mango News,Mango News Telugu,TS Home Minister Mahmood Ali,Home Minister Mahmood Ali Visits Ajmer Dargah,Telangana Mahmood Ali Latest News,Home Minister Mahmood Ali News Today,Mahmood Ali Latest Updates,Telangana Latest News and Updates,Ajmer Dargah News,Ajmer Dargah Latest News

అజ్మీర్ దర్గాను సందర్శించే తెలంగాణ వాసుల కోసం వసతి సదుపాయం కల్పించే విషయమై, స్థానిక అధికారులతో తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ సోమవారం నాడు సమీక్షించారు. రాజస్థాన్ మైనార్టీ శాఖ మంత్రి సలెహ్ మహమ్మద్, కలెక్టర్ అన్షిదీప్, అభివృద్ధి విభాగపు అధికారి అక్షయ్ గోదార తదితర అధికారులతో కలిసి వసతి సదుపాయానికి అవసరమైన నిధుల గురించి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు దాదాపు 2.40 కోట్ల రూపాయలకుపైగా నిధులు కేటాయించిందని హోమ్ మంత్రి మహమూద్ అలీ ఈ సందర్భంగా అధికారులకు తెలియజేశారు.

వసతి సదుపాయానికి అవసరమైన భూమి కొనుగోలు, రిజిస్ట్రేషన్ ల నిమిత్తం ఈ నిధులను వెచ్చించి త్వరితగతిన పనులు చేపట్టాల్సి ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అజ్మీర్ దర్గాతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాశీ, కేరళ రాష్ట్రంలోని శబరిమలై వంటి పుణ్యక్షేత్రాల్లోనూ తెలంగాణ భక్తుల కోసం వసతి సదుపాయాలను నిర్మిస్తుందని హోం మంత్రి మహమూద్ అలీ ఈ సందర్భంగా వారికి తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − eighteen =