తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు, వివరాలు ఇవే…

Telangana SSC Board Revised Fee Payment Dates for SSC Public Exams-2023,TS SSC examination fee payment extended, Telangana SSC Exam,SSC Exam Fees Due Date,Telangana SSC Exam Fees Due Date,Mango News,Mango News Telugu,SSC Exam Fee Due Dates,Telangana SSC,TS SSC Exam Fee Due Date,Telangana SSC May 2023,TS SSC,SSC Exams In Telangana,Ts Ssc Exam Fee Last Date 2023,Ssc Fee Payment Last Date,Ssc Online Challan Payment

తెలంగాణ రాష్ట్రంలో మార్చి 2023లో జరగనున్న పదోతరగతి వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు తేదీలను తెలంగాణ ఎస్.ఎస్.సీ బోర్డు/డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఇప్పటికే ప్రకటంచిన సంగతి తెలిసిందే. ముందుగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 15 వరకు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు. అయితే షెడ్యూల్‌ ప్రకారం ఆ గడువు ముగియడంతో విద్యార్థులకు మరో అవకాశం ఇస్తూ, తాజాగా పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఎస్.ఎస్.సీ/ఓఎస్ఎస్సీ/వొకేషనల్ రెగ్యులర్ విద్యార్థులు, ప్రైవేట్ లో ఒకసారి ఫెయిల్ అయిన అభ్యర్థులు మార్చి 2023 వార్షిక పరీక్షల కోసం ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 24వ తేదీవ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఎస్.ఎస్.సీ బోర్డు డైరెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు-2023 ఫీజు చెల్లింపుల వివరాలు:

  • ఫీజు చెల్లింపు తుది గడువు : నవంబర్ 24 (ఆలస్య ఫీజు లేకుండా)
  • రూ.50 ఆలస్య ఫీజుతో చెల్లింపుకు చివరి తేదీ : డిసెంబర్ 5
  • రూ.200 ఆలస్య ఫీజుతో చెల్లింపుకు చివరి తేదీ: డిసెంబర్ 15
  • రూ.500 ఆలస్య ఫీజుతో చెల్లింపు గడువు: డిసెంబర్ 29.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 9 =