తెలంగాణకు పెట్టుబడుల కోసం పది రోజుల అమెరికా పర్యటనకు పయనమైన మంత్రి కేటీఆర్‌

Telangana Minister KTR 10 Days Tour of America For The Investments, Minister KTR 10 Days Tour of America For The Investments, KTR 10 Days Tour of America For The Investments, Minister KTR 10 Days Tour, Investments, America Tour, KTR 10 Days Tour, Telangana Minister KTR, KTR, Minister KTR, KT Rama Rao, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, Mango News, Mango News Telugu,

ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు కొలువుదీరిన హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దేశంలో ఐటీ రంగంలో హైదరాబాద్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెంచేందుకు, మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ కొలువుదీరేలా చేసేందుకు మంత్రి కేటీఆర్‌ చొరవ చూపుతున్నారు. ఈ క్రమంలోనే నేడు అమెరికా పర్యటనకు కేటీఆర్‌ పయనమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వివిధ బహుళజాతి కంపెనీలను సంప్రదించేందుకు మంత్రి కేటీఆర్‌ అమెరికాకు  బయల్దేరుతున్నారు. పది రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో మంత్రి పలు ప్రముఖ కంపెనీలను సందర్శించనున్నారు.

మంత్రి కేటీఆర్ తోపాటు రాష్ట్రం నుంచి ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, ఎలక్ట్రానిక్స్‌ డైరెక్టర్‌ సుజయ్‌ కారంపూరి, లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తి నాగప్పన్, ఇంకా పలువురు అధికారులు వెళ్ళనున్నారు. ఈ బృందం అమెరికాలోని తూర్పు, పశ్చిమ కోస్తా ప్రాంతాల్లో ఈ నెల 29 వరకు పెట్టుబడుల కోసం పర్యటించనుందన్నారు. మంత్రి కేటీఆర్‌ పర్యటనలో భాగంగా.. 20న శాండియాగో, 21న శాన్‌జోస్‌, 24న బోస్టన్‌, 25న న్యూయార్క్‌ రాష్ట్రాలలోని ప్రముఖ కంపెనీలతో సమావేశమవనున్నారు. ఈ క్రమంలో ఆయా సంస్థల సీఈవోలను కలిసి తెలంగాణాలో పెట్టుబడుల కోసం ఆహ్వానించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ