తెలంగాణ రాష్ట్రంలో మినీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియను మే 3వ తేదీన నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు. ముందుగా ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఐదు గంటలవరకు క్యూ లైన్లలో ఉన్న ఓటర్లకు ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3:00 గంటల వరకు 44.15 పోలింగ్ శాతం నమోదైంది. అయితే పూర్తిస్థాయి పోలింగ్ శాతం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతో పాటుగా సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీలలో మరియు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్‌ఎంసీ)లోని లింగోజిగూడ వార్డు సహా పలు మున్సిపాలిటీల్లో ఖాళీ అయిన వార్డులకు ఈరోజు పోలింగ్ జరిగింది. ఈ మినీ మున్సిపల్ ఎన్నికల కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. నామినేషన్ల అనంతరం అన్ని చోట్ల అభ్యర్థులు జోరుగా ప్రచారం చేసి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల పరిధిలో ప్రధాన పార్టీల ప్రచారం హోరాహోరీగా జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారో వేచిచూడాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ