తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశానికి సంబంధించి టీఎస్ ఎంసెట్-2021 తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మంగళవారం విడుదల చేసింది. అలాగే స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ , స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఇప్పటికే తొలివిడత కౌన్సెలింగ్ పూర్తి అవగా, తుదివిడత, స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ ద్వారా మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నారు. ఇక మూడు విడతల కౌన్సెలింగ్ తర్వాత కూడా ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ మరియు బి-ఫార్మసీ కళాశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి నవంబర్ 25 నుంచి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్ లో అనుసరించాల్సిన ప్రక్రియ వివరాలు మరియు ఇతర సంబంధిత సమాచారం https://tseamcet.nic.in వెబ్‌సైట్ లో అందుబాటులో ఉన్నట్టు తెలిపారు.
టీఎస్ ఎంసెట్-2021 అడ్మిషన్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్:
తుదివిడత:
- ఆన్‌లైన్ లో ప్రాథమిక సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, హెల్ప్ లైన్ సెంటర్ ఎంపిక కోసం స్లాట్ బుకింగ్, మొదటి దశలో హాజరుకాని అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం హాజరు కావాల్సిన తేదీ, సమయం – నవంబర్ 6 నుంచి నవంబర్ 7 వరకు
- తుది దశలో ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ – నవంబర్ 8
- సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనంతరం వెబ్ ఆప్షన్స్ పక్రియ – నవంబర్ 6 నుంచి నవంబర్ 9 వరకు
- ఆప్షన్స్ ఫ్రీజింగ్ సమయం – నవంబర్ 9
- తుది విడత సీట్లు కేటాయింపు – నవంబర్ 12
- వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ – నవంబర్ 12 నుంచి నవంబర్ 15 వరకు
- కేటాయించిన కళాశాలలో రిపోర్టింగ్ – నవంబర్ 12 నుంచి నవంబర్ 16 వరకు
స్పెషల్ రౌండ్ :
- వెబ్ ఆప్షన్స్ పక్రియ – నవంబర్ 20 నుంచి నవంబర్ 21 వరకు
- ఆప్షన్స్ ఫ్రీజింగ్ సమయం – నవంబర్ 21
- సీట్లు కేటాయింపు – నవంబర్ 24
- వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ – నవంబర్ 24 నుంచి నవంబర్ 26 వరకు
- కేటాయించిన కళాశాలలో రిపోర్టింగ్ – నవంబర్ 24 నుంచి నవంబర్ 26 వరకు
—> స్పాట్ అడ్మిషన్స్ గైడ్ లైన్స్ వెబ్ సైట్ లో అందుబాటు : నవంబర్ 25
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ