గ్రేటర్ హైదరాబాద్ జనరల్ బస్ పాస్ ప్రయాణికులకు శుభవార్త

New Bus Passes to Passengers Who Lost Days Validity, TSRTC, TSRTC Bus Passes, TSRTC Bus Passes News, TSRTC Bus Passes Updates, TSRTC Latest News, TSRTC New Bus Passes, TSRTC New Bus Passes to Passengers, TSRTC News, TSRTC to Issue New Bus Passes to Passengers

కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మార్చిలో నిలిచిపోయిన ఆర్టీసీ సిటీ బస్సుల సేవలను సెప్టెంబర్ 25 వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ సమయంలో సిటీ బస్సుల సేవలు నిలిపివేయడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వారి బస్‌పాస్‌ వ్యాలిడిటీని కోల్పోయారు. ఈ నేపథ్యంలో వ్యాలిడిటీ కోల్పోయిన జనరల్‌ బస్‌పాస్‌(ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌, ఎయిర్‌పోర్ట్‌ పుష్పక్‌ ఎసీ బస్‌) హోల్డర్లకు టిఎస్ఆర్టీసీ తాజాగా శుభవార్త అందించింది. లాక్‌డౌన్‌ కారణంగా ప్రయాణికులు కోల్పోయిన ప్రయాణ రోజులను తిరిగి వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. వారంతా తమ బస్‌పాస్‌ తో పాటుగా ఐడీ కార్డులను నవంబర్ 30 లోగా కౌంటర్లలో అందజేసి కొత్త పాస్ పొందాలని ఆర్టీసీ ఈడీ సూచించారు. పాత బస్ పాస్ లో ఎన్ని రోజుల వ్యాలిడిటీ కోల్పోతే అన్ని రోజులను కొత్త పాస్‌ లో జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu