తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల

Telangana Graduate MLC Elections Voter List Schedule Announced

తెలంగాణలో రెండు పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా తయారీకి సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ మరియు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ స్థానాల కాలపరిమితి మార్చి 2027 నాటితో ముగియనున్న నేపథ్యంలో అధికారులు నూతన ఓటర్ల నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

ఫారం-18 ద్వారా ఓటర్ల నమోదు

గతంలో ఓటరుగా నమోదైన వారైనా సరే మళ్లీ కొత్తగా ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారులు తెలిపారు. 2023 నవంబరు 1 నాటికంటే ముందు డిగ్రీ లేదా తత్సమాన విద్య పూర్తి చేసిన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. ఆన్‌లైన్ ద్వారా లేదా సంబంధిత తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో ఆఫ్ లైన్ ద్వారా ఫారం-18 సమర్పించవచ్చని సూచించారు.

ఓటర్ల జాబితా నమోదు సమగ్ర షెడ్యూల్

ప్రక్రియ తేదీ / వ్యవధి
పబ్లిక్ నోటీసు జారీ సెప్టెంబర్ 28, 2026
దరఖాస్తుల (ఫారం-18) స్వీకరణకు చివరి తేదీ నవంబర్ 06, 2026
ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితా ప్రచురణ నవంబర్ 25, 2026
అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ నవంబర్ 25 నుండి డిసెంబర్ 10, 2026 వరకు
అభ్యంతరాల పరిష్కారం డిసెంబర్ 25, 2026 నాటికి
అంతిమ ఓటర్ల జాబితా ప్రచురణ డిసెంబర్ 30, 2026

అర్హత కలిగిన పట్టభద్రులందరూ నిర్ణీత గడువులోగా తమ పేర్లను నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని అధికారులు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here