మ్యాంగో తెలుగు సినిమా యూట్యూబ్ ఛానెల్‌లో ఇటీవల విడుదలైన “Little Things” షార్ట్ ఫిల్మ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జీవితంలో మనం చిన్నవిగా భావించే అనుభూతులే ఎంతటి ఆనందాన్ని ఇస్తాయో చాటిచెప్పే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
రెడ్నం నిర్మల నిర్మాతగా, దర్శకుడు రెడ్నం వెంకటప్రధమేష్ ఎంచుకున్న వినూత్నమైన కాన్సెప్ట్, దానిని పాత్రల ద్వారా నడిపించిన తీరు ప్రశంసనీయం. లహరి గుడివాడ, నిఖిల్ మంగళంపల్లి తమ సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకోగా, పూర్ణం శ్రీధర్, ప్రమీల తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేశారు.
షశాంక్ తిరుపతి నేపథ్య సంగీతం సన్నివేశాలలోని అనుభూతిని పెంచగా, ప్రముఖ గాయని శిరీష భాగవతుల ఆలపించిన పాట ఈ లఘు చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచింది. క్వాలిటీ మేకింగ్ మరియు మనసును హత్తుకునే కథనంతో వచ్చిన ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్‌లో మంచి ఆదరణ పొందుతోంది.










































