ముంబై శివాజీ పార్క్‌లో సిజెపి కన్వీనర్ అభిజీత్ దీప్కే ఆధ్వర్యంలో వేలాది మంది యువకులు, విద్యార్థులు కదం తొక్కారు. పోలీసులు మార్గాలను మూసివేసి ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినప్పటికీ నిరసనకారులు ‘సేవ్ డెమోక్రసీ’ నినాదాలతో హోరెత్తించారు.
-
ముఖ్య నేతలు & సెలబ్రెటీల మద్దతు: ఈ ధర్నాకు ప్రముఖ నటులు షబానా ఆజ్మీ, నసీరుద్దీన్ షా, సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ, తుషార్ గాంధీ తదితరులు హాజరై మద్దతు పలికారు.
-
సిజెపి సవాల్: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయకపోతే ఢిల్లీ వేదికగా ‘జంతర్‌మంతర్ 2.0’ లేదా ‘చలో ఢిల్లీ’ పిలుపునిస్తామని దీప్కే హెచ్చరించారు. “దమ్ముంటే మమ్మల్ని అరెస్టు చేయించండి” అని సీఎం ఫడ్నవీస్‌కు సవాల్ విసిరారు.
-
ఎస్ఐఆర్ అక్రమాలపై ఆరోపణలు: మహారాష్ట్ర నుంచే ఎస్ఐఆర్ అక్రమాలు మొదలయ్యాయని, గత రెండేళ్లలో 13 కోట్ల మంది ఓట్లను తొలగించి, 2024 ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో 40 లక్షల కొత్త ఓట్లను చేర్చి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశారని దీప్కే ఆరోపించారు.





































