ఏపీకి 6 జాతీయ అవార్డులు.. రాష్ట్రానికి గర్వకారణమన్న సీఎం చంద్రబాబు

CM Chandrababu Congratulates AP Emploees and Officers For Winning Six Swachh Survekshan Awards

స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ ఆరు జాతీయ అవార్డులను సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఐదు మున్సిపల్ కార్పొరేషన్లు, ఒక మున్సిపాలిటీ ఈ అవార్డులను దక్కించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం బుధవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో పదో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఆ శాఖ కార్యదర్శి సురేశ్ కుమార్ అవార్డులు అందుకున్నారు. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు కుప్పం మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను సాధించాయి.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా విజేతలకు అభినందనలు తెలిపారు. పారిశుద్ధ్య సిబ్బందికి సీఎం ప్రశంసలు పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది, ఉద్యోగులు, అధికారుల కృషి, అంకితభావం వల్లే ఈ విజయం సాధ్యమైందని చంద్రబాబు పేర్కొన్నారు. అవార్డులు అందుకున్న మంత్రి నారాయణతో పాటు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here