షర్మిల క్లారిటీ ఇచ్చారా? సస్పెన్స్ కొనసాగించారా?

Sunitha Reddy's Political Entry, Political Entry Sunitha Reddy, Sunitha Reddy Political Entry News, Sunitha Reddy Political News, AP, TDP, Janasena, BJP, Sharmila, CM Jagan, AP Elections, CM Jagan, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News
AP, TDP, Janasena, BJP,Sunitha Reddy's political entry,Sharmila ,CM Jagan

కొద్ది రోజులుగా వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబం నుంచి ఆయన భార్య సౌభాగ్యవతమ్మ కానీ, ఆయన కూతురు సునీత కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 15న వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యి 5 ఏళ్లు కావడంతో..ఆరోజు దీనిపై ప్రకటన ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ  కడపలో నిన్న జరిగిన వివేకా  వర్ధంతి కార్యక్రమంలో అలాంటి ప్రకటన రాలేదు.

కాకపోతే సునీత రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారంటూ వస్తున్న వార్తల గురించి ఎదురైన ప్రశ్నలకు  వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు.  ప్రస్తుతం సునీత రాజకీయ రంగ ప్రవేశం ముఖ్యం కాదని చెప్పారు. ప్రజాక్షేత్రంలో తనకు జరగాల్సిన న్యాయం తప్పకుండా జరుగుతుందనే నమ్మకం తనకు ఉందని అన్నారు.

రానున్న ఎన్నికల్లో జగన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటెయ్యొద్దని కోరిన షర్మిల అలా చేస్తేనే  న్యాయవ్యవస్థలో తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని వివరించారు. సునీత తనతోనే తన వెంటే ఉంటారని షర్మిల అన్నారు. త్వరలోనే సునీత రాజకీయ ప్రవేశంపై స్పష్టత ఇస్తామని తెలిపారు.

మరోవైపు  వివేకా  హత్య కేసులో తీవ్ర నిందలు ఎదుర్కొన్న ఆదినారాయణ రెడ్డి కూడా..  వివేకానందరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతోపాటు సునీత వెంట తాము ఉంటామని ఆయన ప్రకటించడం మరింత కీలకంగా మారింది. సునీత రాజకీయ జీవితంపై బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని.. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్టీలకు అతీతంగా తాము మద్దతుగా నిలుస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

వీరి మాటలను బట్టి సునీత రాజకీయాల్లోకి రావడం పక్కా అన్న వాదన వినిపిస్తోంది. కాకపోతే సునీతా రెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తారా? లేకపోతే పులివెందుల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా? అనే ప్రశ్నలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =