కేంద్ర మంత్రితో కలిసి డోలు వాయించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

CM Chandrababu, Dy CM Pawan Kalyan Play Drums With Union Minister Piyush Goyal at CII Partnership Summit

31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆసక్తికరమైన దృశ్యం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కలిసి డప్పులు, డోలు వాయిస్తూ సందడి చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విశాఖపట్నంలో గురువారం ప్రారంభమైన సీఐఐ భాగస్వామ్య సదస్సుకు విచ్చేసిన అతిథులకు స్థానిక కళాకారులు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. థింసా, తప్పెటగుళ్లు, గరగ నృత్యాలతో పాటు డప్పులు, డోలు వాయిద్యాలతో ప్రాంగణంలో సందడి చేశారు.

కళాకారులతో కలిసి నేతల సందడి

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ డోలు కళాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం వారి వద్ద నుంచి వాయిద్యాలను తీసుకుని స్వయంగా డ్రమ్స్ వాయించారు. ముగ్గురు నేతలు ఉత్సాహంగా పాల్గొనడంతో అక్కడి వాతావరణం మరింత సందడిగా మారింది.

సోషల్ మీడియాలో వైరల్ అధికారిక కార్యక్రమాల మధ్య నేతలు ఇలా సరదాగా గడపడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ముగ్గురు నేతలు కలిసి డప్పులు వాయిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీఐఐ సదస్సులో సంప్రదాయ కళారూపాల ప్రదర్శనతో పాటు ఈ ప్రత్యేక ఘట్టం కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here