విజయవాడలో బాపు మ్యూజియం ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

andhra pradesh, AP CM YS Jagan, Bapu Museum, Bapu Museum In Vijayawada, Bapu Museum Vijayawada, Vijayawada, YS Jagan inaugurate the renovated Bapu Museum, YS Jagan Mohan Inaugurates Bapu Museum, YS Jagan Mohan Inaugurates Bapu Museum In Vijayawada

విజయవాడలోని బాపు మ్యూజియాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి గురువారం నాడు ప్రారంభించారు. రూ.8 కోట్లతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన ఈ బాపు మ్యూజియాన్ని సీఎం పునః ప్రారంభించారు. అలాగే మ్యూజియం వద్ద పింగళి వెంకయ్య విగ్రహాన్ని కూడా సీఎం ఆవిష్కరించారు. క్రీ.పూర్వం మొదలుకుని 19వ శతాబ్దం వరకు మానవులు ఉపయోగించిన అరుదైన సుమారు 1500 రకాల వస్తువులు బాపు మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఈ మ్యూజియంలో బుద్ధ-జైన గ్యాలరీ, హిందూ శిల్ప కళ గ్యాలరీ, నాణేలు-శాసనాల గ్యాలరీ, ఆయుధాలు-రక్షణ కవచాల గ్యాలరీలలో ఎన్నో విశేషమైన, విశిష్టత కలిగిన వస్తువులు, ప్రతిమలు, పాత్రలు, ఆయుధాలు పదర్శనకు ఉంచారు. అలాగే ఆంధ్రుల వైభవాన్ని వర్ణించేలా, మన సంస్కృతి ఘనతను రాబోయే తరాలు గుర్తించేందుకు దోహదపడేలా ఎన్నో విషయాలు ఈ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. బాపు మ్యూజియం పునఃప్రారంభోత్సవంలో సీఎం వైఎస్ జగన్ వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, కొడాలి నాని, అవంతి శ్రీనివాస్, ఇతర అధికారులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu