ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్ల ఉద్యోగాలు మరో ఏడాది పొడిగింపు

AP Govt Extends Village and ward Volunteers Jobs, AP Grama Volunteer Notification, AP Grama Volunteer Notification 2020, AP Grama Volunteer Recruitment 2020, AP Grama/Ward Volunteer, AP Grama/Ward Volunteer Recruitment, AP Grama/Ward Volunteer Recruitment 2020, volunteer jobs in ap

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఏడాది ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, పట్టణాల్లో కలిపి మొత్తం 2.6 లక్షల వాలంటీర్లను నియమించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్‌ను నియమించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయడంతో పాటుగా గ్రామ సచివాలయాలకు, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ గ్రామ వాలంటీర్లు వ్యవస్థ అద్భుతమైన ఫలితాలను సాధిస్తుంది. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు వాలంటీర్ల ఉద్యోగాలను మరో ఏడాది పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా వారిని ఏడాది కాలానికి నియమించారు. ఆ గడువు ముగియడంతో వారి సేవలను ప్రభుత్వం తాజాగా మరో ఏడాదికి పొడిగించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here