నేడు ‘జగనన్న తోడు’ పథకం మూడో విడత రుణాల పంపిణీ చేసిన సీఎం జగన్

AP CM YS Jagan Mohan Reddy Launches Third Installment of Jagananna Thodu Scheme Today, AP CM YS Jagan Mohan Reddy To Launch 3rd Installment Of Jagananna Thodu Scheme Today, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, CM YS Jagan, AP CM, 3rd Installment Of Jagananna Thodu Scheme Today, 3rd Installment Of Jagananna Thodu Scheme, Jagananna Thodu Scheme, 3rd Installment, YSRCP Government Announces 3rd Installment Of Jagananna Thodu Scheme, YSRCP Government Announces 3rd Installment Of Jagananna Thodu Scheme To Release Today, AP Govt Releases Jagananna Thodu Third Phase Funds, Jagananna Thodu, Jagananna Thodu Third Phase Funds, AP Govt, Jagananna Thodu Third Phase Funds Release Program, Jagananna Thodu Third Phase, Jagananna Thodu Latest News, Jagananna Thodu Latest Updates, Jagananna Thodu Live Updates, YSRCP Government, AP Govt Releases Jagananna Thodu Third Phase, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు లక్ష్యం అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకం కింద 5,10,462 మందికి ఏపీ ప్రభుత్వం రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. నేడు తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో మూడో విడత రుణాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. రోడ్ల పక్కన, తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకుని జీవనం సాగించే చిన్న వ్యాపారులకు ఈ పథకం చేయూతనిస్తుందని ఆయన తెలిపారు. దీని ద్వారా చిరు వ్యాపారులు స్వయం ఉపాధి పొందాలని ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అని వివరించారు. తాను ప్రతిపక్షంలో ఉండగా చేసిన పాదయాత్రలో చిరు పడుతున్న కష్టాలు చూశానని సీఎం జగన్‌ తెలిపారు.

అప్పుడే ఇలాంటి వ్యాపారులకు ఏదైనా సహాయం చేయాలనీ నిర్ణయించుకున్నానని వెల్లడించారు. అందుకే, అధికారంలోకి రాగానే, వారి కోసం ‘జగనన్న తోడు పథకం’ తీసుకొచ్చామని అన్నారు. మీరు తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తుంటే మళ్లీ రుణం ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 14 లక్షల మందికి ఈ పథకం ద్వారా సహాయం చేయగలిగామని అన్నారు. ఇప్పటికే ఈ పథకం కింద తొలి విడత 5,35,112 మందికి, రెండో విడత 3,70,517 మందికి చొప్పున రెండు విడతల్లో మొత్తం 9,05,629 మందికి రుణాలను అందజేసినట్లు చెప్పారు. ఇప్పుడు మూడో విడత కింద 5,10,462 మంది చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరనుందని అన్నారు. మొత్తం వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి రూ.10వేల వరకు రుణాన్ని అందజేస్తోందని సీఎం జగన్‌ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 11 =