అల్లు స్టూడియోస్ కు శ్రీకారం, ప్రకటించిన అల్లు అర్జున్

Allu Arjun inaugurates Allu Studios in Hyderabad, Allu Family Inaugurates Allu Studios, Allu Ramalingaiah Birth Anniversary, Allu Ramalingaiah’s 99th birth anniversary, On Allu Ramalingaiah 99th birth anniversary

తెలుగు సినీ చరిత్రలో లెజెండరీ హాస్యనటుడు అల్లు రామలింగయ్య 99వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఈ రోజు ఆయనకు అల్లు కుటుంబ సభ్యులు ఘన నివాళులు అర్పించారు. అలాగే అల్లు రామలింగయ్య జయంతిని పురస్కరించుకుని అల్లు కుటుంబం ఓ కీలక ప్రకటన చేసింది. ఆయనకు గుర్తుగా “అల్లు స్టూడియోస్” ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. “మేము మా తాత యొక్క వారసత్వాన్ని సెలెబ్రేట్ చేసుకుంటాము మరియు ఈ అల్లు స్టూడియోను ఆయనకు అంకితం చేస్తున్నాము. మీ అందరి ఆశీర్వాదాలు మరియు శుభాకాంక్షలతో అల్లు స్టూడియోస్ పనులను ప్రారంభిస్తాము” అని అల్లు అర్జున్ ప్రకటించారు.

హైద‌రాబాద్ లోని గండిపేట్ ప్రాంతంలో ఈ అల్లు స్టూడియోస్ ను నిర్మిస్తునట్టుగా తెలుస్తుంది. స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, హీరోలు అల్లు అర్జున్, అల్లు శిరీష్, నిర్మాత అల్లు బాబీ, తదితరులు పాల్గొన్నారు. సినిమా మరియు టీవీ చిత్రీకరణ జరుపుకునేలా అల్లు స్టూడియోను భారీస్థాయిలో నిర్మించబోతున్నట్టు సమాచారం.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here