పాఠశాలల పనివేళల్లో మార్పులు చేస్తూ నిర్ణయం, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

AP Schools Working Hours Changed As Per CM YS Jagan Orders

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి బుధవారం నాడు పాఠశాలల్లో నాడు–నేడు, మధ్యాహ్నభోజన పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచే ప్రారంభం అయ్యేలా చూడాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల నేపథ్యంలో పాఠశాలల పనివేళల్లో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇకపై అన్ని ప్రాథమిక పాఠశాలలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు నిర్వహించనున్నారు. అలాగే ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నాయి.

ముందుగా సమీక్ష సందర్భంగా రాష్ట్రంలో ఉదయం 9.30 గంటలకు పాఠశాలలు ప్రారంభం కావడంపై చర్చ జరిగింది. సాధారణంగా పలు దేశాలు, రాష్ట్రాల్లో పాఠశాలలు ఉదయం 8 లేదా 8.30 గంటలకు ప్రారంభమవుతున్నాయని పేర్కొన్నారు. ఉదయం పూట పిల్లల్లో చురుకుదనం ఎక్కువుగా ఉంటుందని, విషయాలను తొందరగా గ్రహించగలుగుతారని అన్నారు. సాధ్యమైనంత త్వరగా ఉదయం వేళ పాఠశాల్లో బోధన ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. ఈ మేరకు పాఠశాలల పనివేళల్లో మార్పులు చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ