నిరాడంబరంగా ఉగాది వేడుకలు నిర్వహణ : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Fresh Coronavirus outbreak forces Ugadi to be low-key affair, Mango News, Minister Indrakaran Reddy about Ugadi Festival Celebrations, Telangana Endowments Minister Indrakaran Reddy, Telangana Endowments Minister Indrakaran Reddy about Ugadi Festival Celebrations, Telangana Ugadi Festival Celebrations, Telangana Ugadi festivities to be low key, ugadi, Ugadi Festival 2021, Ugadi Festival Celebrations, Ugadi Festival Celebrations In Telangana, Ugadi fete by government to be low-key affair

ప్రతి ఏటా ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం ఆనవాయితీ అని, అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈసారి కూడా ఉగాది వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి టీవీలలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా పంచాంగ శ్రవణాన్ని వీక్షించాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భక్తులు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొని, సహకరించాలని కోరారు.

బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 13న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీలక్ష్మినర్సింహా స్వామి దేవస్థాన ఉగాది పంచాంగాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అనంతరం ఉదయం 10.45 నిమిషాలకు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ పఠన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =