గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ప్రొబేషన్‌ డిక్లేర్‌ పక్రియపై సీఎం జగన్ ఆదేశాలు

AP CM YS Jagan, AP CM YS Jagan Directed Officials on Probation Declaration of Village, AP CM YS Jagan Directed Officials on Probation Declaration of Village Ward Secretariat Employees, AP Government, AP Village Ward Secretariat Employees, AP Village Ward Secretariat Employees News, Mango News, Mango News Telugu, Probation Declaration for AP Grama Ward Sachivalayam, Probation Declaration of AP Village Ward Secretariat Employees, Probation Declaration of Village Ward Secretariat Employees, Ward Secretariat Employees

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఫిబ్రవరి 2, బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలని ఆదేశించారు. ప్రొబేషన్‌ డిక్లేర్‌ పక్రియను
జూన్‌ 30 తేదీ కల్లా పూర్తి చేయాలని, వారందరికీ జూలై 1 నుంచి కొత్త జీతాలు అందాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇక మిగిలిపోయిన 25 శాతం మంది ఉద్యోగులకుం కూడా ప్రొబేషన్‌ పరీక్షలను పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించగా, మార్చి మొదటి వారంలో ఆ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తునట్టు అధికారులు సీఎంకు తెలిపారు.

మరోవైపు కరోనా కారణంగా మరణించిన ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాలు కింద ఉద్యోగాలు ఇవ్వడంపై కూడా సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వారికి యుద్ధప్రాతిపదికన కారుణ్య నియామకాలు ఇవ్వాలని , అందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఖాళీలను వినియోగించుకోవాలని సూచించారు. అన్ని విభాగాలూ ఈ ఆదేశాలపై దృష్టి పెట్టి, ఎలాంటి ఆలస్యానికి తావు ఇవ్వొద్దన్నారు. జూన్‌ 30వ తేదీలోగా కారుణ్య నియామకాలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ