ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత రాజధాని అమరావతే, రాజ్యసభలో కేంద్రం ప్రకటన

Amaravati, Andhra Pradesh Capital, Andhra Pradesh Capital News, Andhra Pradesh Capital Updates, Andhra Pradesh State Capital, Andhra Pradesh State Capital Amaravati, AP Capital In Parliament, Center Gives Clarity About AP Capital, Center Gives Clarity About AP Capital In Parliament, Central Govt, Central Govt Gives Clarity over Andhra Pradesh, Central Govt Gives Clarity over Andhra Pradesh State Capital Amaravati, Central Govt Gives Clarity over Andhra Pradesh State Capital Amaravati in Rajya Sabha, Mango News, rajya sabha

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత రాజధాని అమరావతే అని కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు స్పష్టం చేసింది. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా, రాజ్యసభలో రాజధాని అంశానికి సంబంధించి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఓ ప్రశ్న అడిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏంటి అనేది గందరగోళం నెలకుందని, రాజధానిపై నిర్ణయం తీసుకునే హక్కు ఎవరికీ ఉందనేది స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో ఆయ‌న ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇస్తూ, రాష్ట్ర రాజధానిని నిర్ణయించుకునే అధికారం ఆ రాష్ట్రానికే ఉంటుందని స్పష్టం చేశారు.

ముందుగా 2015లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని నిర్ణయం తీసుకుందని, అనంతరం 2020 జూలైలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయం తీసుకుందన్నారు. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నంను కార్యనిర్వహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా గుర్తిస్తూ చట్టం చేసిందన్నారు. అనంతరం ఆ బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్టుగా వార్తల ద్వారా తెలుసుకున్నామన్నారు. తమ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతే అని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ స‌మాధానమిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =