వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కర్నూలులో ‘రాయలసీమ గర్జన’.. పాల్గొన్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు

AP Several YSRCP Ministers Participates in Rayalaseema Garjana Programme at Kurnool on Demand For Judicial Capital, YSRCP Ministers Participates in Rayalaseema Garjana Programme at Kurnool on Demand For Judicial Capital, Rayalaseema Garjana Programme at Kurnool, Kurnool Rayalaseema Garjana Programme, Rayalaseema Garjana Programme, Judicial Capital, AP Several YSRCP Ministers, YSRCP Ministers, Kurnool Judicial Capital, Rayalaseema Garjana Programme News, Rayalaseema Garjana Programme Latest News, Rayalaseema Garjana Programme Live Updates, Mango News, Mango News Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు, రాష్ట్ర వికేంద్రీకరణ అభివృద్ధికి మద్దతుగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ‘రాయలసీమ గర్జన‘ నిర్వహించింది. సోమవారం కర్నూలులోని ఎస్టీబీసీ డిగ్రీ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు, విశ్యార్థులు, న్యాయవాదులు సహా ప్రజలు భారీగా హాజరయ్యారు. ఇక కర్నూలు పట్టణంలో నిర్వహించిన ర్యాలీ మరియు బహిరంగ సభలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, విడదల రజిని, ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి తదితరులు హాజరయ్యారు. న్యాయవాదులు, విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కార్యక్రమం ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

రాయలసీమ గర్జన సభలో వైఎస్సార్‌సీపీ నేతల వ్యాఖ్యలు..

  • విజ్ఞత ఉన్నవారు అభివృద్ధి అంతా ఒకేచోట చేయడాన్ని హర్షించరు, మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిందే – డిప్యూటీ సీఎం అంజాద్ బాషా.
  • న్యాయ రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, వారి డిమాండ్‌లో న్యాయం ఉంది – మంత్రి పెద్దిరెడ్డి.
  • అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు అధికార వికేంద్రీకరణ కూడా జరగాలిఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు, రాష్ట్ర వికేంద్రీకరణ అభివృద్ధికి మద్దతుగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ‘రాయలసీమ గర్జన’ నిర్వహించింది. సోమవారం కర్నూలులోని ఎస్టీబీసీ డిగ్రీ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు, విశ్యార్థులు, న్యాయవాదులు సహా ప్రజలు భారీగా హాజరయ్యారు.. రాష్ట్రంలోని 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది సీఎం జగన్ ఆకాంక్ష – మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
  • టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేవలం అమరావతిపైనే ఫోకస్ పెట్టారు, మిగిలిన జిల్లాలను వదిలేశారు – మంత్రి ఉషశ్రీ చరణ్.
  • కేవలం తన స్వార్ధ ప్రయోజనాల కోసమే మూడు రాజధానులను చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు – మంత్రి జయరాం.
  • న్యాయ రాజధానిగా కర్నూలుకు అన్ని విధాలా అర్హత ఉంది, దీనిని సాధించుకోవడానికి ఎంతవరకైనా పోరాటం సాగిస్తాం – ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి.
  • శ్రీశైలం ప్రాజెక్టుకి భూములిచ్చిన రాయలసీమ రైతుల త్యాగం వృథా పోరాదు, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని కోరే హక్కు ఇక్కడి ప్రజలకు ఉంది – బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =