స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలనే అంశం దేశవ్యాప్తంగా ప్రకంపణలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఆ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ 23 గే, లెస్బియన్ జంటలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వులో పెట్టింది. దీంతో సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు మంగళవారం ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది.
ఆ పిటిషన్లపై ధర్మాసనం.. నాలుగు వేర్వేరు తీర్పులను వెలువరించింది. స్కలింగ సంపర్క జంటలు చేసుకునే వివాహానికి ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం ఎటువంటి గుర్తింపు లేదని ధర్మాసనం పేర్కొంది. అటువంటి వివాహాలకు ఎటువంటి హక్కుల కల్పించలేమని తెలిపింది. స్వలింగ సంపర్కుల వివాహాలను గుర్తించేలా చట్టాలను రూపొందించాల్సిన బాధ్యత పార్లమెంట్దేనని.. ఆ విషయంలో కోర్టు జోక్యం చేసుకోలేదని ధర్మాసనం పేర్కొంది.
అదే సమయంలో స్వలింగ సంపర్కులు పిల్లలను దత్తత తీసుకోవడంతో పాటు కొన్ని అంశాలపై ధర్మాసనం ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయలేకపోయింది. దీంతో స్వలింగ సంపర్క జంటలకు పిల్లలను దత్తత తీసుకునే హక్కు లేదని 3:2 మెజార్టీతో కోర్టు తీర్పు వెలువరిచింది. అలాగే స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలు లేదా సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైనదనే అపోహను వీడాలని ధర్మాసనం వెల్లడించింది.
ఈ మేరకు స్వలింగ సంపర్క జంటల వివాహాలకు చట్టబద్ధత ఇవ్వలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. కానీ స్వలింగ సంపర్కుల హక్కులను మాత్రం పరిరక్షించాలని పేర్కొంది. లైంగిక ధోరణి కారణంగా ఆ వ్యక్తులు బంధంలోకి వెళ్లే హక్కును నియంత్రించకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE