ఈ బడ్జెట్ కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు – కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే

Congress Chief Mallikarjun Kharge Says This Budget Focused on Elections Not The Nation,Congress Chief Mallikarjun Kharge Says,This Budget Focused on Elections,Not The Nation,Mango News,Mango News Telugu,Union Budget 2023-2024 Updates,Nirmala Sitharaman Presents Budget,Parliament Budget Session 2023,President Murmu Addressed, The Lok Sabha and Rajya Sabha,PM Modi Attends,Parliamentary Committee Meeting Today,Cabinet Committee Meeting Today,Lok Sabha Committee Meeting Schedule,Parliament Meeting Schedule,Parliamentary Committees In India,Committee On Delegated Legislation In India,Committee On Delegated Legislation Upsc,Rajya Sabha Meeting Schedule,Parliamentary Committees Chaired By Speaker,Parliamentary Committees Headed By Speaker,Parliamentary Committees Mcq,Parliamentar

ఈ బడ్జెట్ దేశాన్ని గురించి కాదని, కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిందని ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. బుధవారం కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యువ‌త‌కు ఉద్యోగాల క‌ల్ప‌న‌, ప్ర‌భుత్వ ఖాళీల భ‌ర్తీ, ఉపాధి హామీ ప‌నుల గురించి కనీస ప్రకటన కూడా లేదని విమర్శించారు. నిత్యావసరాలు సహా ఇంధన ధ‌ర‌ల‌ను నియంత్రించేందుకు బ‌డ్జెట్‌లో ఎలాంటి చ‌ర్య‌లు ప్రకటించలేదని కూడా ఖర్గే చెప్పారు. అయితే కేంద్ర బడ్జెట్ స్టడీ చేసిన తర్వాత దీనిపై తమ స్పందన తెలియజేస్తామని ఆయన అన్నారు. బడ్జెట్ పూర్తిగా చూడకుండా ఒక అంచనాతో మాట్లాడటం తప్పు అవుతుందని, బడ్జెట్ రిపోర్టు పరిశీలించిన తర్వాత తప్పనిసరిగా పార్టీ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని ఖర్గే తెలిపారు. అలాగే బడ్జెట్‌పై నిపుణులైన పార్టీ నేతలు ముందుగా దీనిపై విశ్లేషణ చేస్తారని, ఆ తర్వాత తాను మాట్లాడతానని చెప్పారు. కాగా వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, ఈ కేంద్ర బడ్జెట్ నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ కావడం గమనార్హం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =