నిరుద్యోగి ఆశయం..నేడు రూ.14000 కోట్ల సంపాదనకి చేరుకుంది..

Ramachandrans success story,Ramachandrans success,Ramachandran success story,Mango News,Mango News Telugu,MP Ramachandran, Ramachandran Success Story,Ramachandran, success story,Jyoti Laboratories, Exo, Prill, Mr. White, Margo, Maxo,MP Ramachandran Latest News,MP Ramachandran Latest Updates,MP Ramachandran Live News,Ramachandran success Latest News,Ramachandran success Latest Updates,Ramachandran success Story Latest News
M. P. Ramachandran, Ramachandran Success Story,Ramachandran, success story,Jyoti Laboratories, Exo, Prill, Mr. White, Margo, Maxo

విజయం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. దాని కోసం ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డామో అన్న విషయం మాత్రం.. విజయం సాధించినవాళ్లకే తెలుస్తుంది. దానికి పడ్డ కష్టం,చేసిన త్యాగాలు వారికి మాత్రమే గుర్తుంటుంది. కానీ బయటవాళ్లకు మాత్రం ఆ సక్సెస్‌కు ముందు .. ఆ సక్సెస్ తర్వాత ఉన్న పర్సన్ మాత్రమే కనిపిస్తాడు. అందుకే అల్టిమేట్‌గా మనం సాధించిన విజయాలే.. మన గురించే మాట్లాడేలా చేస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటి పెద్ద విజయాన్ని సాధించారు కేరళ వాసి రామచంద్రన్ .

సంకల్పం  గట్టిగా ఉంటే తప్పకుండా విజయం సొంతమవుతుందని రామచంద్రన్ నిరూపించారు. అయితే రామచంద్రన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ..జ్యోతి ల్యాబ్స్ ఫౌండర్ ‘మూతేడత్ పంజన్ రామచంద్రన్’ అంటే చాలామందికి సుపరిచితమే. 1983లో కేరళ త్రిస్సూర్‌లో రామచంద్రన్ జన్మించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ముంబైలో ఒక చిన్న కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేశారు. కానీ కొన్నేళ్ల తర్వాత అక్కడ పని చేసిన తరువాత.. ఆ కంపెనీ మూసివేయడంతో.. ఇంటికి వెళ్లాల్సి వచ్చింది.

చిన్నప్పటి నుంచి రామచంద్రన్‌కు ఖాళీగా ఉండటం నచ్చేది కాదు. ఎప్పుడూ ఏదోక పని చేయడమే కాదు..ఏదో ఒకటి నేర్చుకోవాలన్న తపన చాలా ఉండేది. అలా వచ్చిన ఐడియానే ఇప్పుడు మన ముందు తెల్లగా మెరిసిపోయే లిక్విడ్‌ను తీసుకువచ్చింది. అప్పట్లో తెలుపు రంగు బట్టలకు సరైన లిక్విడ్ అందుబాటులో ఉండేది కాదు. దీంతోనే రామచంద్రన్ ఉజాలా అనే లిక్విడ్ ఫ్యాబ్రిక్ వైట్‌నర్‌ తయారు చేసారు. ఇది మంచి ఫలితాలను ఇవ్వడంతో.. దీనితోనే ఓ చిన్న వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది రామచంద్రన్‌కు.

అనుకున్నదే ఆలస్యం అన్నట్లు..వెంటడ్ ఫ్యానే ఈ లిక్విబ్రిక్ వైట్‌నర్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయన అన్నయ్య దగ్గర నుంచి రూ. 5000 తీసుకున్నారు. తమకున్న కొంత భూమిలోనే చిన్న కంపెనీగా వ్యాపారాన్ని స్టార్ట్ చేసి.. దీనికి తన కూతురు జ్యోతి పేరు పెట్టారు.అయితే ప్రారంభంలో అనుకున్నట్లు..జ్యోతి ల్యాబరేటరీ ఉజాలా అమ్మకాలు జరగలేదు. కానీ రామచంద్రన్ ఏ మాత్రం అధైర్యపడకుండా ..ఎంతమంది వారించినా కూడా కొంతమంది సేల్స్ గర్ల్స్‌ని నియమించి ఆ ఏడాది రూ. 40,000 ఆదాయాన్ని పొంది మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

అలా కొద్దికొద్దిగా తమ ప్రొడక్ట్ మీద కొనుగోలుదారుల్లో నమ్మకం భారీగా పెరిగేలా చేసుకున్నారు రామచంద్రన్. అలా జ్యోతి లేబొరేటరీస్ మరిన్ని ఉత్పత్తులను తయారు చేయడానికి రెడీ అయ్యారు. దీని ఫలితంగానే ఎక్సో, ప్రిల్, మిస్టర్ వైట్, మార్గో, మాక్సో వంటి అనేక ఉత్పతులు మార్కెట్లోకి వచ్చాయి. అయితే మార్కెట్లో గట్టి పోటీ ఇవ్వడంతో చాలా విదేశీ కంపెనీలు తోక ముడుచుకోవాల్సి వచ్చింది.

ప్రారంభంలో ఎన్ని ఆటంకాలు ఎదురయినా.. ప్రత్యర్థులు పన్నాగాలతో గట్టి పోటీ ఇచ్చినా వాటినన్నిటినీ అధిగమించారు రామచంద్రన్. అందుకే తన కంపెనీని దినదినాభివృద్ధి చెంది ఇప్పటికీ అదే జోరు కంటెన్యూ చేస్తోంది. కేవలం రూ. 5000తో ప్రారంభమైన జ్యోతి ల్యాబ్స్ వార్షికాదాయం..ఇప్పుడు ఏకంగా రూ. 14,000 కోట్లకు చేరి.. సక్సెస్ ఫుల్ స్టోరీతో రామచంద్రన్‌ గురించి అంతా మాట్లాడుకునేలా చేస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 3 =