
చాలా మందికి చలికాలంలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. దీని వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి.అయితే జలుబు, దగ్గు తగ్గిపోయినా కఫం మాత్రం అంత సులువుగా పోదు. దీని సింపుల్ చిట్కాలను ఫాలో అయితే చాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ యాలకులు, లవంగాలు కలిపి చేసిన పొడిని తీసుకుంటే.. జలుబు, గొంతునొప్పి, దగ్గు, కఫం పూర్తిగా పోతాయి.
లవంగాలు, చిన్న యాలకులు సమాన క్వాంటిటీలో తీసుకుని పాన్ మీద వేయించి.. వాటిని గ్రైండ్ చేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా తేనె కలిపి రోజూ తినాలి. లవంగాలలో దగ్గును, కఫాన్ని తగ్గించడానికి సహాయపడే అనేక సమ్మేళనాలు ఉన్నాయి. దీనిలో ఉండే ఫ్లేవనాయిడ్లు, హైడ్రాక్సీఫెనైల్ ప్రొపెన్సెస్, యూజెనాల్,కెఫిక్ ఆమ్లం,గాలిక్ ఆమ్లం,క్వెర్సెటిన్ వంటి సమ్మేళనాలు దగ్గును, కఫాన్ని తగ్గిస్తాయి.
వాతావరణం చల్లగా ఉంటే శరీరంలో కఫం సమస్య పెరుగుతుంది.దీనికోసం యాలకులు,లవంగాల పొడి బాగా పనిచేస్తుంది. యాలకుల్లో క్రియాశీల పదార్ధం సినోల్ ఉండటంతో.. ఇది యాంటీమైక్రోబయల్, క్రిమినాశకంగా పనిచేస్తుంది.అది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను నివారించడంలో బాగా సహాయపడుతుంది.యాలకులు, లవంగాల పొడిని తేనెలో తీసుకున్నా.. లేదా పాలలో వేసి తాగినా ఫలితం ఉంటుంది.
అలాగే దగ్గును, కఫాన్ని తగ్గించడానికి పడుకునే ముందు గోరువెచ్చటి పాలల్లో అర స్పూను మిరియాల పొడి, తేనె వేసి కలుపుకుని తాగాలి. ఇలా ప్రతిరోజూ తాగడం వల్ల చలికాలంలో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.అంతేకాదు అల్లం రసంలో తేనె కలుపుకుని తాగినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఉల్లిపాయ రసంలో కూడా తేనె కలుపుకొని తాగినా కూడా దగ్గు, కఫం రాకుండా ఉంటాయి.