వైసీపీ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని చూసి టీడీపీ, జనసేనలు భయపడుతున్నాయి – సీఎం జగన్

AP CM Jagan Slams TDP President Chandrababu and Janasena Chief Pawan Kalyan in Narasapuram Public Meeting Today,TDP, Janasena, afraid development of YCP government, CM Jagan,TDP President Chandrababu,Janasena Chief Pawan Kalyan,Narasapuram Public Meeting,Mango News, Mango News Telugu,AP CM YS Jagan Mohan Reddy ,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించిన ఆయన అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజలు వీటికోసం ఎదురుచూస్తున్నారని, అయితే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. ఈరోజు నరసాపురంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం సంతాషాన్నిస్తోందని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఈ మూడేళ్ళలో మేనిఫెస్టోలో చెప్పిన హామీలలో 98 శాతం నెరవేర్చామని పేర్కొన్నారు.

ఇక ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై సీఎం జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు. అలాగే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని చూసి టీడీపీ, జనసేనలు భయపడుతున్నాయని చెప్పిన ఆయన టీడీపీ, జనసేన పార్టీలకు కొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబు నాయుడును ప్రజలు అన్నిచోట్లా ఓడిస్తున్నారని, చివరికి ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీనే గెలిపించారని అన్నారు. అయితే ఆయన మాత్రం తనకు ఇవే చివరి ఎన్నికలని ప్రజల వద్ద సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తున్నారని, మరోవైపు పవన్ కళ్యాణ్ తనకు ఒక్క అవకాశం ఇవ్వండని అంటున్నారని తెలియపరు. ప్రజలు వీరి మాటలు నమ్మవద్దని, తమకు సంక్షేమ పథకాలు అందిస్తోందెవరో గుర్తించి వచ్చే ఎన్నికల్లో ఓటేయాలని సీఎం జగన్ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 1 =