మత్స్యకారులకు జనసేన పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుంది – పవన్ కళ్యాణ్

Pawan Kalyan Extends Wishes To Fishermen In The State On The Occasion Of World Fisheries Day,Jana Sena Party Will Stand By Fishermen,Pawan Kalyan,World Fisheries Day,Pawan Kalyan Extends Wishes To Fishermen,Mango News, Mango News Telugu,Ap Cm Ys Jagan Mohan Reddy ,Ys Jagan News And Live Updates, Ysr Congress Party, Andhra Pradesh News And Updates, Ap Politics, Janasena Party, Tdp Party, Ysrcp, Political News And Latest Updates

మత్స్యకారులకు జనసేన పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి మత్స్యకార కుటుంబానికీ తన తరఫున, జనసేన పక్షాన శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “రాష్ట్రంలో 970కిపైగా కి.మీ సుదీర్ఘమైన తీరం ఉన్నా, మన మత్స్యకారులు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిపోవడాన్ని అభివృద్ధి అనుకోవాలా?, చెరువుల మీద ఆధారపడి చేపలు పట్టుకొనే మత్స్యకారుల ఉపాధికి గండి కొట్టేలా జీవో 217 జారీ చేయడం పురోగమనం అనుకోవాలా?, రాష్ట్రంలో 80 లక్షల మంది మత్స్యకారుల జీవన స్థితిగతుల మెరుగుదలను విస్మరించిన పాలకులను కచ్చితంగా ప్రజాక్షేత్రంలో నిలదీయాల్సిందే. తీరాన్ని, జల సంపదను నమ్ముకున్న గంగపుత్రుల అభ్యున్నతికి జనసేన పార్టీ కట్టుబడి ఉంది” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

“నేటికీ మత్స్యకార గ్రామాల్లో మౌలిక వసతులు లేవు. నేను చేసిన పోరాట యాత్ర సందర్భంలోను, జనసేన పార్టీ ఈ ఏడాది ఫిబ్రవరిలో చేపట్టిన ‘మత్స్యకార అభ్యున్నతి యాత్ర’లోనూ మత్స్యకారుల ఈతిబాధలు వెల్లడయ్యాయి. సముద్రంలో వేటకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారులకు రూ.10 లక్షలు ఇస్తామనే హామీ నేటికీ సక్రమంగా అమలు కావడం లేదు. నిబంధనల పేరుతో ఆ కుటుంబాలను ఇబ్బందిపెడుతున్నారు. జనసేన పార్టీ మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగుదలకు నిపుణులతో ప్రణాళికలు రూపొందిస్తోంది. మత్స్యకార గ్రామాలలో తాగునీటి కల్పనపై ప్రత్యేక దృష్టిపెట్టడంతోపాటు వారికి విద్య, వైద్య వసతులను సక్రమంగా అందించాల్సిన అవసరాన్ని పార్టీ గుర్తించింది. అదే విధంగా జీవిత, ఆరోగ్య బీమా కల్పన ప్రతి మత్స్యకార కుటుంబానికీ ధీమానిస్తుంది. జనసేన పార్టీ మత్స్యకారులకు ఎల్లవేళలా అండగా నిలుస్తుంది” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 4 =