విజయవాడ కృష్ణానదిలో సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను నిమజ్జనం చేసిన తనయుడు మహేష్ బాబు

Tollywood Actor Mahesh Babu Immerses Late Father Superstar Krishna's Remains in Krishna River at Vijayawada Today,Superstar Krishna Passed Away,Superstar Krishna Passes Away,Tollywood Senior Actor Krishna, Superstar Krishna Hospitalized,Superstar Krishna Illness,Mango News,Mango News Telugu,Actor Superstar Krishna,Superstar Krishna,Senior Actor Krishna,Superstar Krishna Latest News And Updates,Actor Krishna, Actor Krishna Hospitalized,Krishna Hospitalized,Krishna News And Live Updates,Superstar News And Updates

టాలీవుడ్ నటుడు మహేష్ బాబు తన తండ్రి, స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమం కోసం సోమవారం ఆయన కుటుంబ సభ్యులు బాబాయి శేషగిరిరావు, బావ గల్లా జయదేవ్, బావమరిది హీరో సుధీర్ సహా పలువురితో కలిసి హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి కారులో కృష్ణా నది ఉండవల్లి కరకట్ట మీద ఉన్న ధర్మనిలయం వద్దకు చేరుకొని శ్రాధ కర్మలు నిర్వహించే పండితుల సమక్షంలో సాంప్రదాయ రీతిలో కృష్ణానదిలో తండ్రి అస్థికలు కలిపారు మహేష్ బాబు. ఇక వారి వెంట టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు.

కాగా సనాతన హిందూ ధర్మం ప్రకారం మరణించిన వ్యక్తికి ఊర్ధ్వ లోకాలలో సద్గతులు కలగడానికి వారి అస్థికలను వారి వారసులు పుణ్య నదుల్లో నిమజ్జనం చేయడం సంప్రదాయంగా వస్తోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇటీవల మరణించిన సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను నేడు మహేష్ బాబు కృష్ణానది వద్దనున్న దుర్గా ఘాట్‌లో నిమజ్జనం చేశారు. అలాగే కృష్ణ అస్థికలను దేశంలోని మరికొన్ని ఇతర పవిత్ర నదుల్లో నిమజ్జనం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక మహేశ్ బాబు విజయవాడ వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు పలువురు కృష్ణానది వద్దకు వస్తారనే సమాచారంతో విజయవాడ పోలీసులు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు. విమానాశ్రయం మరియు దుర్గా ఘాట్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here