రేపు రాజమహేంద్రవరంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటన

AP CM YS Jagan to Visit Rajamahendravaram Tomorrow to participate in YSR Pension Program

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (జనవరి 3, మంగళవారం) తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ పెన్షన్‌ కానుక పెంపుదల అంశం మరియు పెన్షన్ లబ్ధిదారులతో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ముందుగా మంగళవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం వైఎస్ జగన్ బయలుదేరి 11 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటారు. ఉదయం 11.20 గంటల నుంచి 1.10 గంటల వరకు రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో వైఎస్ఆర్ పెన్షన్‌ కానుక పెంపుదల, లబ్ధిదారులతో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.40 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE