రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ పుట్టినరోజు వేడుకలు

AP Governor Biswabhusan Celebrates Birthday In RajBhavan,AP Governor Biswabhusan Celebrates Birthday,Biswabhusan Celebrates Birthday In RajBhavan,Governor Biswabhusan Celebrates Birthday In RajBhavan,AP Governor Biswabhusan ,AP Governor,ap news, ap new governor, telugu news, ap governor biswabhusan harichandan, biswabhusan harichandan, biswa bhusan harichandan,mango news

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం 86 వ పుట్టినరోజును రాజ్ భవన్ లో జరుపుకున్నారు. ఉదయం 8 గంటలనుండి పుట్టిన రోజు వేడుకలు మొదలయ్యాయి. 86వ వసంతంలోకి అడుగుపెడుతున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కి ఇవి రాష్ట్రంలో తోలి జన్మదిన వేడుకలు. రాజ్ భవన్లో ఉదయాన్నే వేదపండితులు గవర్నర్ కు ఆశీర్వచనాలు అందించారు. అనాథలు, చిన్నారులు మరియు వివిధ వర్గాల విద్యార్థుల మధ్య గవర్నర్ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి జెరూసలేం పర్యటనలో ఉండటంతో మంత్రులు కొడాలి నాని, పెర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాడి విష్ణుతో సహా పలువురు ప్రముఖులు ప్రభుత్వం తరుపున గవర్నర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ జన్మదిన వేడుకల్లో గవర్నర్ విద్యార్థులకు బట్టలు, స్వీట్లు పంపిణీ చేశారు, అనంతరం లయోలా కాలేజీలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వరంలో నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో పాల్గొంటారు.

 

[subscribe]
[youtube_video videoid=jtkI_nyDp8Q]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =