అమరనాథ్ యాత్రకు ఉగ్రవాదుల ముప్పు

Amarnath yatra, General Kanwal Singh Dhillon, Government Calls Off Amarnath Yatra, Jaish-e-Mohammed, Jammu and Kashmir, Jammu And Kashmir Government, Jammu and Kashmir Government Calls Off Amarnath Yatra, Kashmir Government Calls Off Amarnath Yatra, Kashmir Valley, Kishtwar, Lashkar e Taliban, Machail Mata Yatra in Kishtwar, Mango News, Mango News Telugu, pakistan, Shri Amarnath Yatra

అమరనాథ్ యాత్ర ప్రారంభమై నెల రోజులు పూర్తి అవ్వగా, మరి కొన్ని రోజుల్లో పూర్తి అవుతుందనుకునే సమయానికి అమరనాథ్ యాత్రికులు తక్షణం పర్యటనను కుదించుకొని, వీలైనంత త్వరగా రాష్ట్రము వదిలి వెళ్ళాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మరియు ఆర్మీ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులు, సైన్యం అమరనాథ యాత్రికులను లక్ష్యంగా చేసుకున్నట్టు మూడు రోజుల నుండి వస్తున్న సమాచారంతో, అమరనాథ్ ఆలయానికి వెళ్లే మార్గాల్లో సోదా చేపట్టామని భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఇతర పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అమరనాథ యాత్ర నేపథ్యంలో గతంలోనే 70 వేల బలగాలను పంపిన కేంద్రం, రెండురోజులనుండి క్రితం మరో 28 వేల అదనపు బలగాలను తరలిస్తోంది.

లెఫ్టినెంట్ జనరల్ కన్వాల్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ ఉగ్రవాదుల ప్రయత్నాలను భద్రతా బలగాలు భగ్నం చేస్తాయని చెప్పారు. ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో పొంచి ఉన్నారని, వారిని సమర్థవంతంగా ఎదురుకుంటామని తెలిపారు. అమరనాథ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి ప్రయత్నాలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2000, 2001, 2002 మరియు 2017 లో అమర్‌నాథ్ వెళ్తున్న యాత్రికులపై దాడి చేశాయి. జమ్మూ కాశ్మీర్ యొక్క శాంతియుత వాతావరణానికి భంగం కలిగించేలా ఈ దాడులు జరిగాయి, ముఖ్యంగా జూలై మరియు ఆగస్టులలో అమర్‌నాథ్ యాత్రలో, భారతదేశం నలుమూలల నుండి యాత్రికులు జమ్మూ కాశ్మీర్‌కు వస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో అవాంఛనీయ సంఘటనలకు చోటు ఇవ్వకుండ అమర్‌నాథ్ యాత్రతో పాటు, కిష్త్వార్‌లోని మచైల్ మాతా యాత్రను కుడా జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం రద్దు చేసింది.

 

[subscribe]
[youtube_video videoid=Vogad8L_wow]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =