హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ వైరల్ వీడియో వ్యవహారంపై అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రెస్ మీట్

Anantapur SP Pakkirappa Press Meet over MP Gorantla Madhav Viral Video Case, SP Pakkirappa Press Meet over MP Gorantla Madhav Viral Video Case, Anantapur SP Press Meet over MP Gorantla Madhav Viral Video Case, Press Meet over MP Gorantla Madhav Viral Video Case, viral video of Hindupur YSRCP MP Gorantla Madhav, Nude video of Hindupur MP Gorantla Madhav, Anantapur SP Pakkirappa, SP Pakkirappa, Hindupur YSRCP MP Gorantla Madhav, YSRCP MP Gorantla Madhav, MP Gorantla Madhav, Hindupur YSRCP MP, Gorantla Madhav, MP Gorantla Madhav Viral Video Case News, MP Gorantla Madhav Viral Video Case Latest News, MP Gorantla Madhav Viral Video Case Latest Updates, MP Gorantla Madhav Viral Video Case Live Updates, Mango News, Mango News Telugu,

హిందూపురం వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వైరల్ వీడియో వ్యవహారంపై అనంతపురం ఎస్పీ ఫకీరప్ప బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ, సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతున్న ఈ వీడియో ఒరిజినల్ కాదు కాబట్టి మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయన్నారు. “హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా మార్ఫింగ్ చేసి వీడియోను సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులు వైరల్ చేసినట్లు ఎంపీ అభిమాని అయిన అనంతపురం వాసి కొనతాలపల్లి వెంకటేశ్వరరావు, అనంతపురం టూటౌన్ పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 4 వ తేదీన క్రైం నంబర్ 185/2022, సెక్షన్ 67 A, 66 E ఆఫ్ ఐటీ యాక్ట్, సెక్షన్ 292, 509 ఆఫ్ ఐపీసీ కేసు నమోదు చేయడం జరిగింది. ఇంతవరకు లభించిన సమాచారం మేరకు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో మొట్ట మొదటిగా ఐటీడీపీ ఆఫీషియల్ అనే వాట్సాప్ గ్రూపులో ఈ నెల 4 వ తేదీ మధ్యరాత్రి 02:07 ఏఎం గంటలకు తొలిగా ఓ నంబర్ నుండి సదరు వీడియోను పోస్ట్ చేసినట్లు తేలింది. ఈ వీడియో పోస్ట్ చేసే కొన్ని క్షణాల ముందు ఐటీడీపీ ఆఫీషియల్ అనే వాట్సాప్ గ్రూపులో సదరు నంబర్ ను యాడ్ చేయడం జరిగింది. సదరు నంబర్ యూకే వొడాఫోన్ కు సంబంధించినదిగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి అయ్యింది” అని ఎస్పీ చెప్పారు.

“తదుపరి దర్యాప్తులో భాగంగా సోషల్ మీడియాలో తొలిసారిగా వీడియోను పోస్ట్ చేసిన సదరు నంబర్ ఇంటర్నేషనల్ నంబర్ కావడం వల్ల ఆ నంబర్ కు సంబంధించిన వ్యక్తి, వివరాలు సేకరించే పనిలో దర్యాప్తు కొనసాగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ కాదు. ఒక వ్యక్తి రికార్డ్ చేసిన వీడియోను ఇంకొకరికి పంపించి ఆ వ్యక్తి తన మొబైల్ లో చూస్తున్నప్పుడు మరో వ్యక్తి ఆయన మొబైల్ ఫోన్ లోని వీడియోను చిత్రీకరించి ఆ వీడియోను వైరల్ చేయడమైనది. ఈ వీడియో సోషల్ మీడియాలో పలు సార్లు ఫార్వర్డ్ మరియు రీ పోస్ట్ చేయడం జరిగింది. చాలాసార్లు ఈ వీడియోను ఫార్వర్డ్ మరియు రీ పోస్ట్ చేయడం వల్ల ఒరిజినల్ అని నిర్ధారించలేకపోతున్నాం. సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతున్న ఈ వీడియో ఒరిజినల్ కాదు కాబట్టి మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. ఈ వీడియోకు సంబంధించి బాధితులు ఎవరూ ఎటువంటి ఫిర్యాదు చేయలేదు” అని ఎస్పీ ఫకీరప్ప పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =